ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా కన్ను.. బ్రేక్ వేసిన హైకోర్టు

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:37 PM

జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతను రేపటి(గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతను రేపటి(గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చవద్దంటూ బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగింది. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారని.. హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. హైడ్రా విధివిధానాలు ఏమిటి అడిగింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం.. కానీ హైడ్రా ఏర్పాటు , కమిషనర్‌కు ఉన్న పరిధులు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖనే అనుమతులు ఇస్తుందని.. మరో శాఖ కూల్చివేస్తుందని తెలిపింది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగ్‌ను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూలుస్తున్నారని హైకోర్టు పేర్కొంది.

Updated Date - Aug 21 , 2024 | 09:37 PM

Advertising
Advertising