Year Ender 2024: కలసి రాని కాలం
ABN, Publish Date - Dec 23 , 2024 | 09:01 PM
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.
ఈ ఏడాది చోటు చేసుకున్న సంఘటనల్లో అతిముఖ్యమైనది.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది.. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది.. ఏదైనా ఉందంటే.. అది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే. 2024, మే 13వ తేదీన ఈ ఎన్నికల పోలింగ్.. అది కూడా ఒక విడతలోనే జరిగింది. జూన్ 4వ తేదీన ఈ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు చాలా క్లియర్ కట్‌గా స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టాడు. గత అధికార వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదంటే.. రాష్ట్ర ఓటరు ఎంత ముందు చూపుతో ఆలోచించి.. వ్యవహరించాడో ఈ ఫలితాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది.
Also Read: చిత్ర పరిశ్రమలో విషాదం.. శ్యామ్ బెనగల్ ఇక లేరు
ఆ హోదా సైతం దక్కలేదు..
మొత్తం175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుందంటే.. ఇది మాములు విషయం కాదని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అలా అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదంటూ.. మూడు రాజధానుల ప్రకటన చేశారు.
Also Read: ఎన్ని కష్టాలున్నా.. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం విడిచి పెట్టను
అన్ని అడ్డంకులే..
దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చివరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు సైతం చేపట్టారు. వారి యాత్రలకు ఈ ప్రభుత్వం తీవ్ర అడ్డంకులను సృష్టించింది. అయితే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్.. ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వడం గమనార్హం.
Also Read : విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
రాష్ట్రం నుంచి ..
అలాగే సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయిలు.. ప్రజల ఖాతాల్లో వేశారు. ఆ క్రమంలో రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు. అంటే రాష్ట్రంలో రహదారులు, పరిశ్రమలు లేవు. దీంతో యువతకు ఉపాది లేకుండా పోయింది. యువత, ప్రజలు సైతం ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు తరలిపోయారు. ఇలా ఒక్కటి కాదు.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పురోగామి దిశగా కాకుండా.. తిరోగామి దిశగా పయనించిందనే విషయం దాదాపుగా అందరికీ అర్థమైంది. ఇక గత ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలు సైతం పక్కా రాష్ట్రాలకు తరలిపోయాయి. అందులో చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటర్సీ ఉదాహరణ. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన లూలు గ్రూప్ సైతం రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయింది.
Also Read: సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. పుష్పా నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి క్లారిటీ
Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..
వారే లక్ష్యం..
ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోని అగ్రనేతలను గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ కేసులు నమోదు చేసి.. జైళ్లకు పంపింది. అందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు కొల్లు రవీంద్ర, కె. అచ్చెన్నాయుడు, దూళిపాళ నరేంద్ర తదితరులు వారిలో ఉన్నారు. అలాగే జగన్ కేబినెట్‌లోని మంత్రులు కోడాలి నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు తదితరులు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తదితరులను లక్ష్యంగా చేసుకుని విరుచుకు పడ్డారు.
Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు
Also Read: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్
సరిగ్గా ఎన్నికల ముందు..
అంతేకాదు.. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో సైతం వీరినే లక్ష్యంగా చేసుకొని చాలా అసభ్యకర పోస్టింగ్‌లు కూడా పెట్టారు. ఇలా గత అధికార వైసీపీ నాయకాగణం వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అనంతరం వారు టీడీపీ, జనసేనలలో చేరారు.
Also Read: లుంగీ కట్టుకొని బెడ్ రూమ్ లో కూర్చో..ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్
Also Read : రాతి ఉసిరికాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఇంత జరుగుతోన్నా..
అయితే ఇంత జరుగుతోన్నా.. ప్రజల కోసం తాను బటన్ నొక్కానని... వారు తన కోసం ఓటు వేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ విధమైన మూస ధోరణితో ఉండిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు.. స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్‌కు ఓటర్లు ప్రతిపక్ష హోదా సైతం కట్టబెట్టలేదు. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కాలం కలిసి రాలేదని.. ఈ ఏడాది ఆయనకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నది మాత్రం సుస్పష్టం.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News
మరిన్నీ తెలుగు వార్తలు కోసం.
Updated Date - Dec 23 , 2024 | 09:16 PM