ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Year-Ender 2024: ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఏడాది సెర్చ్ చేసిన టాప్-10 పోస్టులు ఇవే.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే..

ABN, Publish Date - Dec 18 , 2024 | 01:42 PM

ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అతి పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఫేస్‌బుక్, యూట్యూబ్ తర్వాత స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఆక్రమించేసింది. సుమారు 2 బిలియన్ వినియోగదారులను ఆకర్షించిందంటే.. క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సర్వసాధారణమైంది. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇన్‌స్టాగ్రామ్‌లో 2024లో అనేక పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే వాటిలో కొందరు చేసిన పోస్టులు మాత్రం తెగ వైరల్ అయ్యాయి. వాటిలో టాప్ 10 పోస్టుల విషయానికి వస్తే..


ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పోస్టుల్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పోస్టు నిలిచింది. ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ విజయాన్ని పురస్కరించుకుని కోహ్లీ పోస్టు చేసిన పోస్టు ఇండియా నుంచి అత్యధికంగా సెర్చ్ చేసిన పోస్టుల్లో ఒకటిగా నిలిచింది. ఈ పోస్టు ప్రస్తుతం 21 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇక ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయిన పోస్టుల విషయానికొస్తే.. ఫుట్‌బాల్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ పోస్టు 75మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వ్యక్తుల పోస్టులతో పాటూ ఓ గుడ్డు ఫొటో కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. world_record_egg అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ ఫొటో 60 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


leomessi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ట్రోపీ పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో విచిత్రంగా 54 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


cristiano అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతున్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో 42 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


leomessi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్టెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అవార్డు పట్టుకున్నట్లుగా ఉన్న ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో గెలిచిన అనంతరం దిగిన ఈ ఫొటో ప్రస్తుతం 41 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


leomessi ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన మరో ఫొటో అత్యధిక లైకులను సొంతం చేసుకుంది. ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అవార్డు పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటో ప్రస్తుతం 34 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


cristiano ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన పేరుతో ఉన్న జెర్సీని పట్టుకుని దిగిన ఈ ఫొటో ప్రస్తుతం 33 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


jiangzhibin24 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ట్రావెల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆకాశంలోని మేఘాలు బంగారు రంగులో మెరుస్తున్నట్లుగా కనిపించాయి. దీంతో ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో 33 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


cristiano అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో మరో ఫొటో నెటిజన్లను దృష్టిని ఆకర్షిస్తోంది. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో నడుస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం 33 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


xxxtentacion ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోస్ట్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. విచిత్రమైన హెయిర్ స్టైల్‌తో ఉన్న వ్యక్తి తలకిందులుగా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం 33 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుని పదో స్థానంలో నిలిచింది.


మరిన్ని ఇయర్ -ఎండర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్‌‌‌పై క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 02:06 PM