Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం..
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:18 PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు..

విశాఖపట్నం, జనవరి 03: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొంత నష్టం జరగనుందని సమాచారం. సుమారు 60 టన్నుల ఉత్పత్తి నాలుగు రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ బెల్టు ద్వారా బొగ్గు ఐరన్ బోర్డు తరలింపు జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్‌లు పడిపోవడంతో సింటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఫుల్ ప్రొడక్షన్‌తో విశాఖ ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటోంది. ఇలాంటి క్రమంలో మళ్లీ ప్రమాదం జరుగడంతో ప్లాంట్ ఎంప్లాయిస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.