ప్రాధాన్యతా క్రమంలో రోడ్లు ఆధునికీకరణ
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:39 AM
అధ్వానంగా ఉన్న రోడ్లను ప్రాధాన్యతా క్రమంలో ఆధునికీకరింపచేసి ప్రజలకు మెరుగైన రోడ్డు, రవాణా మార్గాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.

ముమ్మిడివరం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): అధ్వానంగా ఉన్న రోడ్లను ప్రాధాన్యతా క్రమంలో ఆధునికీకరింపచేసి ప్రజలకు మెరుగైన రోడ్డు, రవాణా మార్గాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. స్థానిక 3వ వార్డులోని చింతలమెరక, 19వ వార్డు మట్టాడిపాలెం రోడ్ల ఆధునికీకరణకు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్‌మాధుర్ మంజూరుచేసిన రూ.50లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రతీ ఇంటికీ మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి,ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్, కమిషనర్ జి.రవివర్మ, ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, కట్టా సత్తిబాబు, మాదాల బుజ్జి, దివి విజయ్, పిల్లి నాగరాజు, గొల్లపల్లి గోపి, దాట్ల బాబు, పెన్మెత్స జగ్గప్పరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు, రెడ్డి సుధీర్, రెడ్డి శివన్నారాయణ, కాశి లాజర్, సరిపెల్ల శ్రీనివాసరాజు, గోరింట్ల శ్రీనురాజు, సత్తి నూకరాజు, పి.నరసింహమూర్తి, రెడ్డి సుధీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌లు పీవీ సుధాకర్, కె.శ్రీనివాస్, ఎ.సత్యనారాయణరాజు, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.