BJP : ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
ABN, Publish Date - Apr 07 , 2025 | 12:12 AM
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇనచార్జ్ రావి చైత న్య కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు.

హాజరైన మంత్రి సత్యకుమార్, మెదక్ ఎంపీ రఘునందన
అనంతపురం సెంట్రల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇనచార్జ్ రావి చైత న్య కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ మెదక్ ఎంపీ రఘునందన రావు హాజరై మాట్లాడారు. కుటుంబ వారసత్వంగా కాకుండా, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు అందించే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఆర్థికంగా ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగో స్థానానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు సమ న్వయంతో పనిచేస్తుండటంతో బీజేపీ ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిద్దాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులతోపాటు అశోక్‌రెడ్డి, విశ్వనాథ్, అజేష్ యాదవ్, పెద్దయ్య, రాము, రమేష్, వెంకటస్వామి, చెన్నకేశవనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి: భారతీయ జనతాపార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివమూర్తి, సీనియర్ నాయకులు జిలకర ఆంజనే యులు, శ్రీనివాసులరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 07 , 2025 | 12:12 AM