FIRE : అగ్నికి ఆహుతైన చీనీ తోట
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:26 AM
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చీనీ తోటతో పాటు వ్యవ సాయ పరికరాలు కాలి పోయిన ఘటన శనివా రం రాత్రి శివపురంలో చోటుచేసుకుంది. దీంతో రైతుకు రూ. 8 లక్షలు నష్టం వాటిల్లింది. స్థాని కులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెం దిన మురళి నాలుగు ఎకరాల్లో చీనీ తోట సాగుచేస్తున్నాడు.

- కాలిపోయిన వ్యవసాయ పరికరాలు
కనగానపల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చీనీ తోటతో పాటు వ్యవ సాయ పరికరాలు కాలి పోయిన ఘటన శనివా రం రాత్రి శివపురంలో చోటుచేసుకుంది. దీంతో రైతుకు రూ. 8 లక్షలు నష్టం వాటిల్లింది. స్థాని కులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెం దిన మురళి నాలుగు ఎకరాల్లో చీనీ తోట సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం చీనీ పంట కోతదశలో ఉంది. ఉగాది పండుగ తరువాత పంటను కోసి మా ర్కెట్‌కు తరలించాలని రైతు భావించాడు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు తోట పక్కన ఉన్న చెత్తకు నిప్పుపెట్టడంతో మంటలు వ్వాపించి చీనీతోట కాలిపోయింది. రాత్రిపూట కావడంతో మంటలు అదుపుచేసేందుకు వీలుకాలేదు. దీంతో తోటలోని వ్యవసాయ పరికరాలు సైతం మంటల్లో కాలిపోయా యని బాధిత రైతు వాపోయాడు. చీనీతోట కాలిపోవడంతో రూ.8లక్షల వరకూ నష్టపోయాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....