hockey ఉత్కంఠగా హాకీ పోటీలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:07 AM
స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల హాకీ పోటీలు మూడో రోజైన మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగా యి.

ధర్మవరం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల హాకీ పోటీలు మూడో రోజైన మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగా యి. తిరుపతి - అనకాపల్లి జట్లు తలపడగా 3-1గోల్స్ తేడాతో తిరుపతి, అన్నమయ్య - శ్రీకాకుళం జట్లు తలపడగా 6-0 గోల్స్ తేడాతో అన్నమయ్య, కాకినాడ - అనంతపురం జట్లు తలపడగా 5-3 గోల్స్ తేడాతో కాకినాడ, కడప - సత్యసాయి జట్లు తలపడగా 3-0 గోల్స్ తేడాతో కడప జట్లు గెలుపొందాయి. బుధవారం ఉదయం సెమీ ఫై నల్‌లో తిరుపతి - కాకినాడ జట్లు, అన్నమయ్య - కడప జిల్లా జ ట్లు తలపడనున్నాయి. వీటిలో గెలుపొందిన జట్లకు మధ్యాహ్నం ఫైనల్స్ నిర్వహిస్తారు.