GOD : శ్రీవారికి హనుమద్వాహన సేవ

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:15 AM

కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.

GOD : శ్రీవారికి హనుమద్వాహన సేవ
Lord walking on Hanumadvahanam

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకిలో ఉరేగించారు. సాయంత్రం స్వామి హను మద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని కోర్కెలు కోరారు. బ్రహోత్సవాల్లో భాగంగా సోమ వారం గరుడవాహన సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 10 , 2025 | 12:16 AM