Share News

LOK ADALATH: రాజీకి లోక్‌ అదాలత చక్కటి పరిష్కారం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:50 PM

రాజీకాదగ్గ కేసులకు లోక్‌ అదాలత చక్కటి పరిష్కారమని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాకేష్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయాధికారి అధ్యక్షతన జాతీయ లోక్‌ అదాలత నిర్వహించారు.

LOK ADALATH: రాజీకి లోక్‌ అదాలత చక్కటి పరిష్కారం
Puttaparthi: Judicial officer Rakesh participated in the Lok Adalat

పుట్టపర్తిరూరల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాజీకాదగ్గ కేసులకు లోక్‌ అదాలత చక్కటి పరిష్కారమని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాకేష్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయాధికారి అధ్యక్షతన జాతీయ లోక్‌ అదాలత నిర్వహించారు. ఐపీసీ (సీసీలు) 62 కేసులు, మద్యం సీసీ కేసులు 28, సివిల్‌కేసులు4, ఎస్‌టీసీ కేసులు 71, బ్యాంకుపిల్‌కేసులు 6తో కలుపుకుని 143కేసులు, సీజ్డ్‌మనీఫైనతో కలిపి 60800, బ్యాంకు ప్రీలిటిగేషన కింద8,57,500 విలువ గల వివిధ కేసులు రాజీమార్గంలో పరిష్కరించారు. బార్‌ అసోషియేషన అధ్యక్షుడు కత్తిగంగిరెడ్డి, లోక్‌ అదాలత సభ్యులు నాగేంద్ర, లెక్కల యదుభూషణ్‌, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పూజారి ప్రసాద్‌, నిడిమామిడి శ్రీనివాసులు, భారతిరెడ్డి, చల్లా చంద్రశేఖర్‌, కుంచెపు శ్రీనివాసులు, మౌనిక, క్రిమినల్‌ క్లర్క్‌ మంజునాథ్‌, సివిల్‌క్లర్క్‌ అశ్వత్థనారాయణ, ఎంఎల్‌ఏసీ లక్ష్మానాయక్‌ పాల్గొన్నారు.

రాజీమార్గంతో జీవితం సుఖమయం

ధర్మవరం: రాజీమార్గంతో జీవితం సుఖమయం అవుతుందని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి గీతావాణి అన్నారు. శనివారం స్థానిక కోర్టులో జాతీయ మెగాలోక్‌అదాలత నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంతో కేసుల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసం జాతీయ మెగాలోక్‌అదాలత నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అదాలతలో 308 కేసులను పరిష్కరించినట్లు న్యాయాధికారి తెలిపారు. విడాకుల కేసులు 3, బ్యాంకు రుణం 2(రూ.42వేలు), ప్రీలిటిగేషన కేసు 1(రూ.2లక్షలు), జరిమానా కేసులు 4(రూ.13వేలు), ఈపీ 2(రూ.1,19లక్ష), భరణం 1, భూమి పరిష్కారం 3, కొట్లాట కేసులు 126, సారాకేసులు 65(1.91లక్షలు), ఇసుక రవాణా కేసులు 14 (రూ..1.84లక్షలు), పేకాట కేసులు 88 (రూ.1,50,430) పరిష్కరించినట్లు తెలిపారు. జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి పీవీ హరీశ, న్యాయవాదులు పాల్గొన్నారు.


చట్టాలు ఎన్ని ఉన్నా.. మనిషి మారాలి

కదిరిలీగల్‌: చట్టాలు ఎన్ని ఉన్నా మనిషి మారనప్పుడు ఫలితాలు ఆశాజనకంగా ఉండవని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్‌ జయలక్ష్మి అన్నారు. జాతీయ లోక్‌ఆదాలత సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించారు. న్యాయాఽధికారి మాట్లాడుతూ వరకట్నం తీసుకోవడం, దొంగతనం చేయడం, మహిళలను వేధించడం నేరమని తెలిసి కూడా మూర్ఖంగా పాల్పడుతూనే ఉంటే కట్టడి చేయడం ఎలాగని ప్రశ్నించారు. అసాంఘిక కార్యకలాపాలన్నీ చట్ట వ్యతిరేకమని తెలిసికూడా మనిషి పాల్పడుతుండటం వల్లే పరిస్థితి దిగజారి పోతోందన్నారు. మహిళ చదువుకోవాలి, చైతన్యవంతురాలు కావాలన్నారు. మహిళ యోగక్షేమాలలో పురుషుని పాత్ర కూడా ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఇరువురూ సమానమేనని ముందుకు వెళ్లినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావన్నారు. న్యాయాధికారి బుజ్జప్ప, న్యాయవాదులు సత్యనారాయణగుప్త, అంబటి శివప్రసాద్‌, లోకేశ్వర్‌రెడ్డి, రామస్వామి, రఘునాథ్‌, పవన, సీఐ డీవీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:50 PM