Pay bills ఉపాధి బిల్లులు చెల్లించండి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:22 AM
తమకు రావాల్సిన బిల్లులు పది వారాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే తమ ఖాతాలో జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు.

తనకల్లు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): తమకు రావాల్సిన బిల్లులు పది వారాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే తమ ఖాతాలో జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కదిరప్ప మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని పారదర్శకంగా అమలు చే యాలని, ఇందులో రాజకీయ నాయకుల జోక్యం పూర్తిగా నివారించాలని డిమాండ్ చేశారు. పనిదినాలను 200 రోజులకు, దిన కూలిని రూ.700కు పెంచాలన్నారు. అనంతరం ఎంపీడీఓ రెడ్డెప్ప, ఎపీఓ మరియమ్మకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల అధ్యక్షుడు రెడ్డెప్ప, ఆనంద్, రవి, రవినాయక్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.