Share News

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:10 AM

ల్ప, చిత్రకళా క్షేత్రమైన లేపాక్షిలో గురువారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం
Chariot moving amidst crowd

పురవీధుల్లో ఉత్సాహంగా ఊరేగింపు

లేపాక్షి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శిల్ప, చిత్రకళా క్షేత్రమైన లేపాక్షిలో గురువారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో శివపార్వతులను ఊరేగించారు. వేలాది మంది భక్తుల నడుమ శివపార్వతులు లేపాక్షి ప్రధాన వీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లాతోపాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పలువురు దాతలు భక్తులకు అన్నదానం, పానకం, మజ్జిగ, మంచినీళ్లను అందజేశారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం మునిసిపల్‌ చైర్మన డీఈ రమేష్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్‌ సీఐ జనార్దన ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 28 , 2025 | 12:10 AM