SREERAM: వైభవంగా రాములోరి బ్రహ్మరథోత్సవం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:43 AM
శ్రీరామనవ మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఏడో రోజున శనివారం బ్రహ్మరథో త్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి, మడుగు తేరు లాగారు. అనంతరం ఆల య ఆవరణలో రథాంగహోమం నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : శ్రీరామనవ మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఏడో రోజున శనివారం బ్రహ్మరథో త్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి, మడుగు తేరు లాగారు. అనంతరం ఆల య ఆవరణలో రథాంగహోమం నిర్వహించారు. సాయంత్రం విశేషం గా అలంకరించిన రథంలో ఉత్సవిగ్రాహాలనుఉంచి ఊరేగించారు. రాత్రి కి దశహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని వేదికపై శ్రీ నృత్యశిక్షణాలయం చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో స్వామివార్లకు నృత్యనీరాజనం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శోభ, భక్తమండలి నరేంద్ర చౌదరి, శ్రీనివాసులు చౌదరి, జిజే వేణు, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, హర్ష, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....