TDP: తోపుదుర్తీ.. జాగ్రత్త..!
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:59 PM
తోపుదుర్తీ.... జాగ్రత్త.. కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తే బీసీలంతా ఏకమై మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుల ఫైర్
ధర్మవరం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): తోపుదుర్తీ.... జాగ్రత్త.. కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తే బీసీలంతా ఏకమై మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. శనివారం స్థానిక గాంధీనగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు తలారి చంద్రమోహనబాబు, అంబటి సనతకుమార్, రాళ్లపల్లి షరీఫ్, పఠానబూబూఖాన, డిష్ లచ్చి, షామీర్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు వరదరాజులు మాట్లాడారు. తోపుదుర్తి, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డికి వయస్సు పెరిగినా బుద్దిపెరగడంలేదన్నారు. ఇప్పటికీ వారి అధినాయకుడు లెవనరెడ్డి(జగనరెడ్డి) కుట్రలు, కుతంత్రాలు మోసాలకు అలవరచుకుని జిల్లాలో అదే రాజకీయాలు కులాల మధ్య వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీల్లారా వైసీపీ కులాల ఉచ్చులో పడకుండా మేలుకొనాల్సిన అవసరం ఎంతైనాఉందన్నారు. మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా పరిటాల సునీత, పరిటాలశ్రీరామ్ వెంటే ఉమ్మడి జిల్లా బీసీలందరూ ఉంటారని వారు పేర్కొన్నారు.
బత్తలపల్లి: పరిటాల కుటుంబాన్ని విమర్శించేస్థాయి తోపుదుర్తి కుటుంబానికి లేదని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక పార్టా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పరిటాల కుటుంబానికి రాష్ట్రంలోనే దానధర్మాలు చేసే కుటుంబమని పేరుందన్నారు. మీకుటుంబానికి అక్రమ వసూళ్లు, కబ్జాలు చేస్తారనే పేరు ఉందని విమర్శించారు. పరిటాల కుటుంభాన్ని విమర్శిస్తేనియోజకవర్గ ప్రజలు నీకు రాజకీయ భవిషత లేకుండా చేస్తారన్నారని మాజీ ఎమ్మేల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిపై మండి పడ్డారు. కార్యక్రమంలో నారాయణస్వామి, నాగభూషణ చౌదరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: పరిటాల కుటుంబాన్ని విమర్శించే అర్హత తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధికారప్రతినిధి నిమ్మలకుంట దళవాయి కుళ్లాయప్ప అన్నారు. శనివారం మండలంలోని నిమ్మలకుంట గ్రామంలో ఆయన నివాసంలో మాట్లాడారు. పాపిరెడ్డిపల్లిలో వ్యక్తిగతంగా జరిగిన హత్యకు ప్రకా్‌షరెడ్డి రాజకీయరంగు పులిమి, బీసీల ఓట్లు కోసం రాజకీయం చేయడం అవివేకమన్నారు. కురుబ లింగమయ్యను రెచ్చిగొట్టింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. రాప్తాడు అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే పరిటాలసునీత పనిచేస్తుంటే ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రకా్‌షరెడ్డి స్వార్థరాజకీయాలు చేస్తున్నారని, ఇది ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
ముదిగుబ్బ: పరిటాల కుటుంబాన్ని విమర్శించే స్థాయి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డికి లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం రాత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలు, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచింది పరిటాల కుటుంబమని, పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. క్లస్టర్ ఇనచార్జ్ తుమ్మల మనోహర్, మహబూబ్‌పీరా, మల్లెల నారాయణస్వామి, స్టుడియో అశోక్, ఆనంద్, నరసింహ, రఫి, చంద్ర, సూర్యనారాయణ పాల్గొన్నారు.