Surya Ghar Muft Bijli Yojana: ఇల్లు ఉన్న వారికి సన్‌షైన్ ఆఫర్..పైకప్పు మీద ప్యానెల్స్‌తో కరెంట్ ఫ్రీ, ఆదాయం కూడా
ABN , Publish Date - Apr 12 , 2025 | 10:05 AM
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై మరింత తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు సౌర ప్యానెల్‌ల ద్వారా కుటుంబాలు ఏటా రూ.15 వేల ఆదాయం కూడా పొందొచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన స్కీంను కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచితంగా ప్రతినెల 300 యూనిట్ల విద్యుత్‌ను అందిస్తున్నారు. దీనిని ఏర్పాటు చేసుకుంటే పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే కుటుంబాలు కేవలం ఉచిత కరెంటుతోనే కాక, ప్రతి సంవత్సరం సుమారు రూ.15,000 వరకు అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్య కుటుంబాల ఆర్థిక భద్రతకు తోడ్పడేలా రూపొందించిన ఈ పథకానికి కేంద్రం ఇప్పటికే రూ.60,000 వరకు సబ్సిడీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మార్గంలో ముందడుగు వేసి అదనంగా రూ.20,000 వరకు రాయితీని ప్రకటించడం విశేషం. ఈ విధంగా, సుమారు రూ.80,000 వరకు ఆదాయం తగ్గించే అవకాశాన్ని కల్పిస్తూ, ప్రజలకు చవక విద్యుత్ మాత్రమే కాక, ఒక స్థిర ఆదాయ మార్గాన్ని కూడా ఈ పథకం అందిస్తోంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు
భారతదేశ స్థానిక నివాసితులు ఈ పథకానికి అర్హులు
దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి
మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
ఈ పథకం అన్ని కులాల వారికి వర్తిస్తుంది
దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయబడి ఉండటం తప్పనిసరి
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి అప్లై చేయాలంటే ఈ క్రింది పత్రాలు ఉండటం తప్పనిసరి
ఆధార్ కార్డు
నివాస ధృవీకరణ పత్రం
విద్యుత్ బిల్లు
బ్యాంక్ పాస్‌బుక్
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
రేషన్ కార్డు
మొబైల్ నంబర్
అఫిడవిట్
ఆదాయ ధృవీకరణ పత్రం
దరఖాస్తు ప్రక్రియ
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – pmsuryaghar.gov.in
హోమ్ పేజీలో "Apply For Rooftop Solar" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మొదట మీరు నమోదు చేసుకోవాలి, దీనికి మీకు ఈ వివరాలు అవసరం: రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ మొబైల్ నంబర్, ఇమెయిల్, వినియోగదారు నంబర్.
ఆ తర్వాత ఇచ్చిన దశల ప్రకారం దరఖాస్తు చేసుకోండి
సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది
ఈ పథకం కింద, ప్రతి కుటుంబానికి 2 KW వరకు సౌర విద్యుత్ ప్లాంట్ ఖర్చులో 60% సబ్సిడీగా వారి ఖాతాలో జమ చేయబడుతుంది. ఎవరైనా 3 కిలోవాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, వారికి 1 కిలోవాట్ల ప్లాంట్‌పై అదనంగా 40% సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. అందులో నుంచి ప్రభుత్వం 78 వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన రూ.67,000 కు చౌకైన బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇవి కూడా చదవండి:
Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News