AP Women voters : మొత్తం ఓటర్లు 4,14,40,447
ABN, Publish Date - Jan 07 , 2025 | 03:43 AM
రాష్ట్రంలో మరోసారి మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలక పాత్ర పోషించనున్నారు. 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ...
మహిళలే తీర్పరులు.. ఓటర్ల సంఖ్యలో అగ్రస్థానం
పురుషులతో పోలిస్తే 7.3 లక్షల మంది మహిళా ఓటర్లే అధికం
2025-తుది జాబితా విడుదల.. పురుష ఓటర్లు: 2.03 కోట్లు
2.1 కోట్ల మంది మహిళలు.. థర్డ్ జండర్ల ఓట్లు: 3,400
2025-తుది జాబితా విడుదల
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలక పాత్ర పోషించనున్నారు. 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇచ్చిన ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కంటే కూడా మహిళా ఓటర్లు 7,31,415 మంది అధికంగా ఉన్నారు. ఈ మేరకు ‘ఓటర్ల తుది జాబితా-2025’ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన 2025 ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,20,935 మందిగా ఉండగా తాజా జాబితాలో 19,512 మంది ఎక్కువగా నమోదయ్యారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు చేరింది.
మరిన్ని వివరాలు
ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుషులు 2,03,47,738 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,03,52,816కు చేరింది.
మహిళా ఓటర్లు ముసాయిదా జాబితాలో 2,10,69,803 ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 2,10,84,231కి చేరింది.
థర్డ్ జెండర్ల ఓట్లు 3400కి చేరాయి.
సర్వీసు ఓటర్లు సంఖ్య 67,143 మంది ఉండగా తాజాగా వారు 66,690కి తగ్గారు.
ప్రవాసాంధ్రుల(ఎన్‌ఆర్‌ఐ) ఓట్లు 8,043 ఉన్నాయి.
ఎలక్టోరల్ టు పాపులేషన్(ఈపీ-ఉన్న జనాభాలో ఓటర్ల సంఖ్య) రేషియో 719గా నమోదైంది.
రాష్ట్రంలో మొత్తం 46,397 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ముసాయిదా జాబితా తర్వాత.. తాజాగా విడుదల చేసిన తుది జాబితా నాటికి 1,02,227 మంది కొత్త ఓటర్లు చేరారు.
మరణించిన, బదిలీ అయిన, రిపీటెడ్ ఓటర్లు 82,262 మందిని ముసాయిదా జాబితా నుంచి తొలగించారు.
18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 5,14,646 మంది.
Updated Date - Jan 07 , 2025 | 03:46 AM