Share News

Andhrajyothy: అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా!

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:59 AM

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ అంటూ.. ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా అధికారులు-ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నడుమ వారధిగా మారనుంది. ఐదేళ్లుగా ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు తోడుగా నిలవనుంది. ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులను, అధికారులను

Andhrajyothy: అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా!
Andhrajyothy

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ మహత్తర కార్యక్రమం

రేపు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు.. ప్రజల చెంతకే అధికారులు, ప్రజా ప్రతినిధులు

నేరుగా సమస్యలు విన్నవించే చాన్స్‌.. పరిష్కారమయ్యే దాకా ప్రజలకు అండగా

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘అక్షరమే ఆయుధం’గా అక్షర సేద్యం చేస్తున్న ‘ఆంధ్రజ్యోతి’.. ప్రజా సమస్యల పరిష్కారానికీ నడుం బిగిస్తోంది. ఇప్పటి వరకు ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చూపుతున్న ‘ఆంధ్రజ్యోతి’.. ఇకపై ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకు కదులుతోంది.


‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ అంటూ.. ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా అధికారులు-ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నడుమ వారధిగా మారనుంది. ఐదేళ్లుగా ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు తోడుగా నిలవనుంది. ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులను, అధికారులను తీసుకువచ్చి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా చూపి, వాటికి పరిష్కారం సాధించడమే ‘ఆంధ్రజ్యోతి’ చేపడుతున్న ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ప్రజలు తమ స్థానిక సమస్యలను నేరుగా నివేదించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక సదస్సులను నిర్వహించనుంది.


తొలి కార్యక్రమం మంగళవారం పలు నగరాలు, పట్టణాల్లో జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు విని, పరిష్కార మార్గాలపై దృష్టిసారించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది. వెలగని వీధి దీపాల నుంచి రోజుల తరబడి తొలగని చెత్త దాకా.. రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్లదాకా.. ఆకతాయిల ఆగడాలకు చెక్‌ పెట్టడం నుంచి ఆక్రమణలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వ స్థలాలకు ప్రహరీలు నిర్మించే దాకా.. ఇలా ప్రజలు ప్రస్తావించే పలు సమస్యలపై అధికారులు, నేతలు దృష్టిసారిస్తారు. సమస్య తీవ్రత, నిధుల లభ్యతను బట్టి వారు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ సదస్సుల్లో నేతలు, అధికారులు ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యేదాకా ‘ఆంధ్రజ్యోతి’ స్థానిక ప్రజల వెంట ఉంటుంది. ఆయా సమస్యలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 07:57 AM