CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

ABN, Publish Date - Mar 17 , 2025 | 02:36 PM

2024 మే, జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధాని అమరావతితోపాటు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతికి మళ్లీ అడుగులు పడ్డాయి.

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం
AP CM Chandrababu

అమరావతి, మార్చి 17: గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్‌లో పెట్టగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 1990లలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కోసం విజన్ 2020 తీసుకు వచ్చామని గుర్తు చేశారు. తద్వారా నాడు చెప్పిన దాని కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు.

అయితే 2047 వికసిత్ భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారన్నారు. అందులోభాగంగానే ఆంధ్రప్రదేశ్‌ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించామని చెప్పారు. అందులో ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని వివరించారు.

2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే రూ. 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇక ప్రతి ఏటా రూ. 15 శాతం వృద్ధి రేటుతో రూ. 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వివరించారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొత్తంగా జీఎస్టీపీ రూ. 18,65,704 కోట్ల మేర.. తలసరి ఆదాయం రూ. 3.47 లక్షల లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. 2014-19 కన్నా 1.5 శాతం అదనంగా పెరుగుదల ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. మూడు పార్టీలు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాయని గుర్తు చేశాయి. దీంతో 93 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయని సీఎం చంద్రబాబు వివరించారు.


2024 మే, జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతితోపాటు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతికి మరోసారి అడుగులు పడ్డాయి. అందులోభాగంగా.. రాష్ట్రాభిృద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభిృద్ధిని పక్కన పెట్టింది. సంక్షేమం పేరుతో ప్రజలకు నగదు పంచింది. తద్వారా రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అలాంటి వేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 11 స్థానాలనే కైవసం చేసుకొంది.

ఇవి కూడా చదవండి...

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 03:17 PM