Share News

Bhashyam Inter Results: ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన భాష్యం

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:20 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన మార్కులు సాధించారు

Bhashyam Inter Results: ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన భాష్యం

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఏపీ ఇంటర్‌ ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్‌ ఎంపీసీలో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎన్‌.శ్రీరామ్‌, డి.మణికంఠ, కె.చిన్మయిగౌడ్‌, యాసిన్‌ సాజిద్‌, పి.సంజయ్‌ 470 మార్కులకు 466 మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ ఎంపీసీలో మొత్తం 420 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్‌ ఎంపీసీలో ఎన్‌.జయశ్రీ 1000కి 991 మార్కులు, జె.తారణి, కె.కావ్యశ్రీ 990 మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ విభాగంలో మొత్తం 218 మంది విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్‌ బైపీసీ విభాగంలో భాష్యం మెడెక్స్‌ విద్యార్థి ఎ.ప్రమోదలక్ష్మి 440కి 436 మార్కులు, పది మంది విద్యార్థులు 435 మార్కులు సాధించారని చెప్పారు. మొత్తం 84 మంది విద్యార్థులు 430కి పైగా మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ బైపీసీ విభాగంలో జి.హాసిని, వై.నాగశరణ్య 1000కి 989 మార్కులు, ఎల్‌.నవ్య, షేక్‌ వసీమా, బి.భవ్య 988 మార్కులు సాధించారని తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 05:22 AM