Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం
ABN , Publish Date - Feb 07 , 2025 | 09:19 PM
Cabinet Decisions: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త జోన్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ఆమోదం తెలిపింది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త జోన్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. పోస్ట్ ఫ్యాక్టో కింద దీనికి అప్రూవల్ ఇచ్చినట్లు కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం న్యూఢిల్లీలో వివరించారు. ఇక స్కిల్ ఇండియా కోసం రూ.8,800 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0కి రూ.6000 కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్‌కు రూ.858 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
మరోవైపు బుధవారం రైల్వే బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కూటమి ప్రభుత్వం విజ్జప్తిని పరిగణంలోకి తీసుకుని ఈ తాజా నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇక ఈ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయని పేర్కొంది. ఇక రాయగడ్ రైల్వే డివిజన్ పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లను చేర్చారు. ఇక కొండపల్లి, మోటుమర్రి సెక్షన్ ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
For AndhraPradesh News And Telugu News