Share News

ముక్కంటి సేవలో నటి పూజాహెగ్డే

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:42 AM

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ప్రముఖ సినీ నటి పూజాహెగ్డే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు.

ముక్కంటి సేవలో నటి పూజాహెగ్డే
సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటున్న పూజా హెగ్డే

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ప్రముఖ సినీ నటి పూజాహెగ్డే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాధికారులు హరియాదవ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖులను కమ్మేస్తున్న సిబ్బంది

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది అత్యుత్సాహంతో కొందరు ప్రముఖులను కమ్మేస్తున్నారు. వారికి చిరాకు తెప్పిస్తున్నారు. విధులు నిర్వర్తించాల్సిన పాయింట్లను వదలి సెల్ఫీల కోసం వెంటపడుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలా గురువారం సినీ నటి పూజాహెగ్డే దర్శనానంతరం కంచుగడప వద్దకు రాగా.. ఆలయ సిబ్బంది చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - Apr 04 , 2025 | 01:42 AM