Share News

Farmer: ఆనంద ‘జల’

ABN , Publish Date - Jan 09 , 2025 | 03:10 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో రాత్రికిరాత్రి అధికారులు వేసిన బోరుబావితో ఆ పేద రైతు జీవితంలో వెలుగు నిండింది. ‘జై చంద్రబాబు.. జై జై చంద్రబాబు అన్న అసంకల్పిత నినాదం ఆయప్ప నోటివెంట వెలువడింది.

Farmer: ఆనంద ‘జల’
చలపతి పొలంలో బిగిస్తున్న పంప్‌సెట్‌ - రాత్రికిరాత్రి పంప్‌సెట్‌ బిగించి పైపులైన్లు ఏర్పాటు చేయడంతో ఉప్పొంగుతున్న జలం

కుప్పం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో రాత్రికిరాత్రి అధికారులు వేసిన బోరుబావితో ఆ పేద రైతు జీవితంలో వెలుగు నిండింది. ‘జై చంద్రబాబు.. జై జై చంద్రబాబు అన్న అసంకల్పిత నినాదం ఆయప్ప నోటివెంట వెలువడింది. శాంతిపురం మండలం సోమాపురం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధ రైతు చలపతి. సహకార బ్యాంకులో చేసిన రూ.50వేల రుణం ఏకంగా రూ.85వేలకు చేరింది. బ్యాంకు అధికారులు గొంతుమీద కూర్చొన్నారు. హంద్రీ-నీవా కాలువకు ఉన్న పొలంలో ముప్పావువంతు వెళ్లిపోయింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పరిహారం సైతం అందలేదు. మిగిలిన కొద్దిపాటి పొలమైనా పండించుకుందామన్న ఆశతో శక్తికి మించి వ్యయం చేసి బోరుబావి తవ్వించారు. అయితే విద్యుత్తు పంప్‌సెట్‌ కావాలి. అప్పటికే అప్పులపాలైన చలపతికి అదెలా సాధ్యమవుతుంది.. కాలేదు. ఏమిచేయాలో పాలుపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం వస్తున్నారని తెలిసి. ఎన్నో ఆశలతో చలపతి ఈనెల 7వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన నాయకుడు పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా అర్జీ ఇవ్వడానికి వచ్చారు. ఆయన అదృష్టం.. స్వయంగా చంద్రబాబే ఆయనుంచి అర్జీని స్వీకరించారు.. ఆ పేద వృద్ధ రైతు ఏకరువు పెట్టిన కష్టాలను సావధానంగా ఆలకరించారు. చలపతి రుణాన్ని రీషెడ్యూల్‌ చేయమని చెప్పడంతోపాటు 48 గంటల్లో ఆయన పొలంలో విద్యుత్తు మోటారు ఏర్పాటు చేసి, పైపులైన్లు బిగించాలని అధికార గణానికి ఆదేశాలు జారీ చేశారు. అంతే.. అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పురుషోత్తం ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు అదేరోజు సాయంత్రం సోమాపురం వెళ్లారు. చలపతి పొలంలో 10 హెచ్‌పీ/30 విద్యుత్తు పంప్‌సెట్‌ ఏర్పాటు చేశారు.


అదేరోజు రాత్రి భూగర్భంనుంచి జల ఉప్పొంగి పాలంలోని పంటను తడిపింది. ఇది చూసిన పేద రైతు చలపతి ఆనందం పట్లలేకపోయారు. ‘నా దేవుడు చంద్రబాబు. ఆయనకు నేనేకాదు మా కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ చంద్రబాబుకు జైకొట్టారు.

Updated Date - Jan 09 , 2025 | 03:10 AM