Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..
ABN, Publish Date - Jan 17 , 2025 | 08:36 AM
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు రోజుల్లో నాలుగు లక్షల 75 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.

తిరుపతి: తిరుమల (Tirumala)లో భక్తుల (Devotees) రద్దీ (Crowd) నెలకొంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikuntha Dwara Darshan) కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు (TTD Officers) అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్స్ కోటా పూర్తి అయింది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంచే ఈ నెల 19వ తేదీ వరకు సంబంధించిన టోకెన్స్ కోటాని అధికారులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్‌ని ఏ రోజుకు ఆ రోజూ జారీ చేయనున్నారు. దర్శనం టికెట్స్, టోకెన్స్ వున్న వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు అనుమతిస్తుండడంతో.. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తమ తిరుమల పర్యటన ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా ఏడు రోజుల్లో నాలుగు లక్షల 75 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు..
కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజాము 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు వీఐపీలకు వైకుంఠద్వార దర్శనాలు చేయించారు. ఆ తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించారు. స్లాట్లవారీగా అర్థరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలను కల్పించారు. ఇక, వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ తిరుమలలో మోస్తరుగానే భక్తుల రద్దీ కొనసాగింది. ఏకాదశి సందర్భంగా ఉదయం స్వర్ణరథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంలో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక, శ్రీవారి ఆలయం ముందు ఎక్కడికక్కడ గేట్లు వేయడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. శనివారం ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ..
వృద్ధుడి నుంచి రూ.10.90 లక్షలు కొల్లగొట్టారు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 17 , 2025 | 08:43 AM