Share News

Anna Lezhneva Donation: కుమారుడి పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:56 AM

Anna Lezhneva Donation: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి కోలుకున్నాడు. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమణి అన్నా కొణిదెల తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 Anna Lezhneva Donation: కుమారుడి పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం
Anna Lezhneva Donation

తిరుమల, ఏప్రిల్ 14: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా (Konidela Anna Lezhneva Tirumala Donation) తిరుమలలో భారీ విరాళాన్ని అందజేశారు. నిత్యాన్నదానికి తిరుమల అధికారులకు రూ.17 లక్షల విరాళం అందజేశారు అన్నా కొణిదెల. ఈరోజు (సోమవారం) అన్నదానంలో మధ్యాహ్నం భోజనానికి అయ్యే రూ.17 లక్షల రూపాయలను తన కుమారుడు మార్క శంకర్ (Konidela Mark Shenkar) పేరిట పవన్ సతీమణి విరాళంగా టీటీడీ అధికారులకు ఇచ్చారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్నా లెజినోవా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.


కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని పవన్ సతీమణి అన్నా లెజినోవా సోమవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. సింగపూర్‌లో పవన్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడు కోలుకోవాలంటూ శ్రీవారిని మొక్కుకున్నారు అన్నా కొణిదెల. మార్క్ శంకర్ త్వరగానే కోలుకోవడంతో మొక్కును తీర్చుకునేందుకు నిన్న (ఆదివారం) తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా గాయత్రి నిలయం వద్ద అన్నా లేజీ నోవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేసి ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆపై పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకుని.. శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. రాత్రి తిరుమల్లోనే బస చేసిన అన్నా కొణిదెల.. ఈరోజు (సోమవారం) సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

anna-konidela.jpg

Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గ్రద్ద


తిరుమలలో అడుగడుగునా ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ శ్రీవారికి మొక్కులు చెల్లించారు అన్నా కొణిదెల. దేవుడికి హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టారు. ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో అన్నా లెజినోవాకు వేదపండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానంతరం ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం గుండా రేణి గుంట విమానాశ్రయానికి బయలుదేరారు డిప్యూటీ సీఎం సతీమణి. రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు అన్నా లెజినోవా పయనమయ్యారు.

anna-konidela.jpg


కాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్న సమయంలో సింగపూర్‌లో ఓ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కుమారుడు మార్క శంకర్ గాయపడ్డారు. శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే పవన్ కళ్యాణ్‌తో పాటు చిరు దంపతులు కూడా సింగపూర్‌కు వెళ్లి శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడటంతో అక్కడి వైద్యుల సలహాతో చిన్నారిని వెంటనే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్.


ఇవి కూడా చదవండి

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 12:05 PM