ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchu Manoj: రోజుకో వివాదం... మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:29 PM

Manchu Manoj: నిన్నటి పరిణామాలపై హీరో మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని.. డీఎస్పీతో చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని మంచు మనోజ్ చెబుతున్నారు.

Manchu Manoj

తిరుపతి, జనవరి 16: హీరో మంచు మనోజ్ (Manchu Manoj) గురువారం ఉదయం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్‌ను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని నిన్న (బుధవారం) మనోజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్నటి పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని మంచు మనోజ్ చెబుతున్నారు.


మంచు ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. నిన్న తిరుపతిలో మోహన్‌బాబు కాలేజ్‌ వద్దకు వెళ్లిన మంచు మనోజ్‌ను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాలేజ్‌కు వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరీ మనోజ్ అక్కడకు చేరుకున్నారు. అయితే అంతకు ముందే మనోజ్‌ను కాలేజ్‌ వద్దకు రానీయకుండా మోహన్‌ బాబు కోర్టులో ఇంజెక్షన్‌ పిటిషన్‌ వేయగా.. అందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కాలేజ్‌ వద్దకు వచ్చిన మనోజ్‌కు పోలీసులు కోర్టు ఉత్తర్వుల కాపీని జిరాక్స్‌ రూపంలో చూపించారు. అయితే తనకు ఒరిజన్ కాపీలు అందలేదని.. తనకు అందాల్సిన ఒరిజన్ కాపీని పోలీసులకు ఎలా ఇచ్చారని అని మనోజ్ ప్రశ్న లేవనెత్తారు.

నంద్యాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే


ఒరిజనల్‌ కాకుండా జిరాక్స్‌ కాపీలను మాత్రమే ప్రతీ గేటు వద్ద తనకు చూపించారని మనోజ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులను కూడా మనోజ్ ప్రశ్నించారు. ఈ కాపీలను ఎవరు ఇచ్చారని అడిగారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు లీగల్ టీం, సతీమణి మౌనికతో కలిసి చంద్రగిరి పోలీస్‌స్టేష్‌న్‌కు మనోజ్ వచ్చారు. పోలీసుల వద్ద ఉన్న జిరాక్స్‌ కాపీని ఎవరు ఇచ్చారు అనేదానిపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. దీనిపై పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని తాను వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ తెలియజేశారు.


కాగా.. నిన్న పెద్ద పండుగ సందర్భంగా కాలేజ్‌లో ఉన్న తన తాత, అవ్వ సమాధి వద్ద నివాళులర్పించేందుకు అనుమతించకపోవడంపై మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు మోహన్‌బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్‌ను లోపలికి అనుమతించిన పరిస్థితి. దీంతో మనోజ్ తన సతీమణితో కలిసి లోపలికి వెళ్లి తాత, అవ్వ సమాధుల వద్ద నివాళులర్పించారు. అంతుకు ముందు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

కోట్లలో కూత

రుణాల కోసం పాస్‌పుస్తకాలు అడగొద్దు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 03:27 PM