ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఆ తేదీల్లో శ్రీవారి దర్శనం దొరకనట్టే

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:59 PM

Andhrapradesh: తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 94 కౌంటర్లలో 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల పాటు టికెట్స్, టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

TTD EO Shyamala Rao

తిరుమల, జనవరి 7: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నారు. ఈనెల 10న వైకుంఠ ఏకాదశిని సందర్భంగా మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ సర్వం సిద్ధం చేసింది. తాజాగా వైకుంఠ ద్వారాలను ఏ రోజునుంచి తెరువనున్నారు.. ఏ సమయంలో ప్రముఖులను అనుమతిస్తారు అనే విషయాలను టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈవో మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తెలిపారు. 10న తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే ఉదయం 8 గంటలకు సర్వదర్శనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 9 గంటలకు స్వామి వారు స్వర్ణ రధంపై భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు. 11న తెల్లవారుజామున 4:30 గంటలకు వరాహ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు.


తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 94 కౌంటర్లలో 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేస్తామని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల పాటు టికెట్స్, టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. 9న ఎస్డీ టోకెన్స్ జారీని రద్దు చేశామని ఈవో తెలిపారు. కాలినడక భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం టోకెన్స్ కూడా రద్దు చేశామన్నారు. తిరుమల్లోని వివిధ ప్రదేశాల్లో 12 వేల వాహనలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు వేల మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. మూడు వేల మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

నెక్స్ట్‌ ఏంటి.. ఏసీబీ సమాలోచనలు


శ్రీవారి నమూనా...

మహా కుంభమేళా నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. మూడు ఎకరాల్లో ఆలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆలయంలో స్వామి వారికీ నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు.


పటిష్టమైన భద్రత: ఎస్పీ సుబ్బరాయుడు

వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుపతిలో టోకెన్స్ జారీ చేసే కేంద్రాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 1200 మందితో బందోబస్త్ ను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

హైకోర్టులో కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్ తప్పదా

రోహిత్-కోహ్లీకి ఒక్కటే దారి

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 07 , 2025 | 01:05 PM