P V Sunil Kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:49 PM
p v sunil kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీఐడి అధికారులు కార్యాలయానికి పిలిపించారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న సాక్ష్యాలను వారు తీసుకున్నారు. అలాగే ధరణికోట వెంకటేష్, దారపనేని నరేంద్రతోపాటు సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సీఐడీ కార్యాలయానికి రావాలని సూచించారు.

అమరావతి, ఫిబ్రవరి 11: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో భాగంగా న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో సీఐడీ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. మంగళవారం సీఐడీ అధికారులు.. న్యాయవాది లక్ష్మీనారాయణను పిలిపించి.. ఈ ఆరోపణలపై విచారించారు. గతంలో సీఐడీ డీజీగా ఉన్న సమయంలో పీవీ సునీల్ కుమార్.. అరాచకాలకు పాల్పడ్డారని, అలాగే అనేక మందిని నిర్బంధించారని.. అంతేకాకుండా ఆయన సమక్షంలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ సమయంలో హోం శాఖ స్పందించి.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కానీ పోలీస్ శాఖ దీనిపై సరైన రీతిలో స్పందించలేదు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన ఫిర్యాదు వ్యవహారం ఎంత వరకు వచ్చిదంటూ కేంద్ర హోం శాఖకు మళ్లీ న్యాయవాది లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డీజీపీ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. అందులోభాగంగా ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న ఆధారాలన్నీ సీఐడీ అధికారులు తీసుకున్నారు.
అలాగే టీడీపీ మీడియా సెల్ ఇన్ ఛార్జ్ దారపనేని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుతోపాటు, టీడీపీకి చెందిన నేత ధరణికోట వెంకటేష్‌లను అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి తన వద్దనున్న సాక్ష్యాధారాలను సీఐడీ అధికారులకు ఈ సందర్భంగా ఆయన అందజేశారు. అర్థరాత్రి గోడలు దూకి మరి అరెస్టులు జరిగిన తీరును ఈ సందర్భంగా సీఐడీ అధికారులకు ఆయన వివరించారు.
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారని తెలిపారు. అర్థరాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఆయన్ని నిర్బంధించారని.. కనీసం ఆయన వయస్సును సైతం పోలీసులు పట్టించుకోకుండా వ్యవహరించారని సీఐడీ అధికారులకు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఇక ధరణికోట వెంకటేష్ వ్యవహారంలో సైతం పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని తెలిపారు.
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
దారపనేని నరేంద్రను అరెస్ట్ చేసిన సమయంలో కూడా పోలీసులు ఇదే రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ అరెస్ట్‌ల సమయంలో ఇంట్లోని వారిని సైతం తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. దీంతో న్యాయవాది లక్ష్మీనారాయణ వాంగ్మూలం ఆధారంగా.. ధరణికోట వెంకటేష్‌తోపాటు దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు కార్యాలయానికి పిలుపించుకొన్నారు. వారి స్టేట్‌మెంట్ సైతం వారు రికార్డు చేస్తున్నారు. అలాగే సీనియర జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సీఐడీ కార్యాలయానికి వచ్చిన స్టేట్‌మెంట్ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.
For AndhraPradesh News And Telugu News