Share News

అధ్యక్షా... సభలో నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ బాలేదు: చంద్రబాబు

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:23 AM

శాసనసభలో ఇంటర్నెట్‌ పనితీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది.

అధ్యక్షా... సభలో నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ బాలేదు: చంద్రబాబు

సీఎంగారూ... ఇది మీరిచ్చిన నెట్‌వర్కే: రఘురామరాజు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): శాసనసభలో ఇంటర్నెట్‌ పనితీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. సోమవారం ‘విజన్‌-2047’పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇంటర్నెట్‌ వేగం తక్కువగా ఉండడంతో సమస్యలు తలెత్తాయి. దీనిపై సీఎం స్పందిస్తూ ‘అధ్యక్షా! సభలో ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ బాలేదు’ అని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ మాట్లాడుతూ... ‘ఇది మీరిచ్చిన నెట్‌వర్కే... ఆ సెక్యూర్డ్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంది కాబట్టి మీ ప్రజెంటేషన్‌ సందర్భంగా అంతరాయం ఏర్పడింది. ఇది మావల్ల జరగలేదు’ అన్నారు. దీంతో సీఎం నవ్వి ఊరుకున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:23 AM