Share News

DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:12 PM

బెట్టింగ్ యాప్స్‌పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మెుత్తం 11 మంది ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
West Zone DCP Vijay Kumar

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై కేసులు నమోదు (Case On Youtube Influencers) కావడం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో హైదరాబాద్ పంజాగుట్ట (Punjagutta) పోలీసులు నిన్న(సోమవారం) కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజతో సహా మెుత్తం 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. కాగా, దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ (West Zone DCP Vijay Kumar) తాజాగా మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు.


ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. "బెట్టింగ్ యాప్స్‌పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మెుత్తం 11 మంది ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై క్రిమినల్ కేసులు పెట్టాం. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నాం. ఏఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎలాంటి వీడియోలు పెట్టారనే అంశాలను పరిశీలిస్తున్నాం. ముందుగా ఆధారాలను సేకరించి అనంతరం వారిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. వీరంతా బెట్టింగ్ యాప్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దు.


ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ విలువలు లేకుండా గలీజ్ వీడియోలు చేస్తున్నాడు. తన వీడియోల కోసం చిన్నపిల్లలనూ వాడుకుంటున్నాడు. ఇమ్రాన్ లాంటి వ్యక్తులపై నిఘా పెంచాం. ఎవరైనా యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకుల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చోరీ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. దొంగ డిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించాం. అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నాం. నిందితుడు డిల్లీలో 30కి పైగా ఇళ్లల్లో చోరికి పాల్పడ్డాడు. హైదారాబాద్‌లో ఇది మొదటి చోరీ ప్రయత్నం. డీకే అరుణ ఇల్లు అని తెలియకుండా దొంగతనానికి వెళ్లాడు. పెద్ద ఇల్లు కాబట్టి ఎక్కువ నగదు దొరుకుతుందని భావించి చోరికి యత్నించాడని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Justice Nagesh: రూ.కోటి ఫైన్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Crime News; కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Updated Date - Mar 18 , 2025 | 02:24 PM