Share News

New Business Idea: ఈ చెట్టు ఆకులు అమ్మితే ఏడాదంతా డబ్బే డబ్బు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:14 PM

Business Idea: ఎల్లప్పుడూ ఆదాయం తెచ్చిపెట్టే పంట సాగు చేయాలని భావిస్తున్నారా. మీకున్న కొద్దిపాటి స్థలంలోనే ఒక్కసారి ఈ చెట్టు నాటితే చాలు. దీనికి కాసే ఆకులే మీకు లక్షలు తెచ్చిపెడతాయి. ఈ చెట్లు నాటితే కొన్నేళ్ళ పాటు దిగులు లేకుండా హ్యాపీగా డబ్బు సంపాదించవచ్చు.

New Business Idea: ఈ చెట్టు ఆకులు అమ్మితే ఏడాదంతా డబ్బే డబ్బు..
Farming Business Idea

Low Investment Business Idea: సర్వస్వం ధారపోసి పంటలు పండిస్తుంటారు రైతులు. వాతావరణ పరిస్థితులు, దళారులు, మార్కెట్ డిమాండ్ వీటన్నింటిని దాటుకున్న తర్వాత పెట్టిన పెట్టుబడి తిరిగొస్తేనే గొప్ప. కానీ, ఈ మధ్య చాలామంది యువత టెక్నాలజీని వ్యవసాయానికి జోడిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు వదిలేసి సొంతూళ్లలో వ్యవసాయదారుడిగా స్థిరపడుతున్నారు. సక్సెస్ అవుతున్న వారిలో నూటికి తొంభై మంది పాటించే ఏకైక సూత్రం.. సరైన పంటను ఎంపిక చేసుకోవడం. మార్కెట్లో ఏ పంటకు మంచి డిమాండ్ ఉంది. ఎంత ఆదాయం వస్తుంది అని తెలుసుకున్న తర్వాతే పక్కా ప్లానింగ్‌తో సాకులోకి దిగుతున్నారు యువరైతులు. అలాంటి ఓ వినూత్న వాణిజ్య పంట గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం.


ఈ చెట్టుకు ఎంత డిమాండ్ అంటే..

కామినీ చెట్టు. దీని గురించి మీరెప్పుడైనా విన్నారా.పేరు వినకపోయి ఉండచ్చేమో కానీ కచ్చితంగా ఎక్కడైనా చూసే ఉంటారు. ఎందుకంటే ఈ చెట్టు ఆకులు,పూలు పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్లు, అలంకరణలు ఇలా చాలాచోట్ల అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. అంతేకాదు.. ఆయుర్వేద మందులు, వంటల తయారీలో, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కూడా వాడుతుంటారు. ఇన్ని చోట్ల వాడుతున్నారు కాబట్టే మార్కెట్లో ఈ చెట్టు ఆకులు, పూలకు ఊహించనంత డిమాండ్ ఉంది. అదీగాక ఈ చెట్టు ఆకులు, పూలు త్వరగా కుళ్లిపోవు. వాడిపోవు.ఎక్కువ సమయం తాజాగానే ఉంటాయి.


తక్కువ ఖర్చు.. దీర్ఘకాలిక లాభాలు..

ఇది గమనించే బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు ఈ కామినీ చెట్లు పెంచి ఏడాది తిరక్కుండానే లక్షలు సంపాదించాడు. తక్కువ ఖర్చుతో నాటే కామినీ పంట దీర్ఘకాలం పాటు మీకు ఆదాయాన్ని అందిస్తూనే ఉంటుంది. నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీరు, ఎరువులు ఇస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సిన పనిలేదు. మెయింటెనెన్స్ ఖర్చు చాలా స్వల్పం. ఒకసారి నాటాక ప్రతి సంవత్సరం చెట్టు నుంచి కొమ్మలను తీసుకోవచ్చు. ఒక కొమ్మను నరికితే దాని స్థానం మరిన్ని కొమ్మలు పుట్టుకొస్తాయి. ఆకులన్నీ గంపగుత్తగా ఒకేసారి బరువు తూచి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ పంట సాగు కోసం ఏమేం అవసరం అవుతాయి. లాభాలు, మార్కెటింగ్ తదితర వివరాలు చూద్దాం.

tree.gif


  • పెట్టుబడి : ఒక ఎకరాకు కనీస పెట్టుబడి- రూ.25,000

  • సంవత్సర లాభం : రూ.3 లక్షలు (10 టన్నులు అమ్మితే)

  • 5 ఏళ్లలో వచ్చే లాభం: రూ.72 లక్ష లు (కనీసం)

  • మార్కెటింగ్ : కిలోకు రూ.30. ఆన్‌లైన్ ప్లాట్ ఫాంల ద్వారా వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు.

మీరు చేసే బిజినెస్ స్థాయిని బట్టి అవసరమయ్యే లైసెన్సులు, పంటకు ఇన్సూరెన్స్ చేయించాలి. స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పంట సాగు చేస్తే మరీ మంచిది.


Read Also : ఖజానాకు కాసుల గలగల
Jio Hotstar Complementary Subscription: త్వరలో ఐపీఎల్

బజాజ్‌కు అలియాన్జ్‌ గుడ్‌బై

Updated Date - Mar 18 , 2025 | 02:21 PM