Share News

Chittoor Gold Robbery: గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:25 AM

చిత్తూరులో బంగారం దోపిడీ కేసులో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. రూ.3.20 కోట్ల బంగారు బిస్కెట్లు పోలీసులు పట్టుకున్నారు

Chittoor Gold Robbery: గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు

చిత్తూరు జిల్లాలో కారు దోపిడీ చేసిన కేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరు అర్బన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో 2 రోజుల కిందట జరిగిన బంగారం దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.3.20 కోట్ల విలువైన 3.5 కిలోల ఐదు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కర్ణాటక కాంగ్రె్‌సకి చెందిన కౌన్సిలర్‌ ఉన్నారు. ఎస్పీ మణికంఠ వివరాలను మీడియాకు తెలిపారు. కర్ణాటకలోని కేజీఎ్‌ఫకు చెందిన దీపక్‌కుమార్‌ బంగారం, వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన వద్ద పనిచేసే చేతన్‌కుమార్‌, ముక్రుమ్‌ ఈనెల 2న రాత్రి తమ కారులో చెన్నై నుంచి కేజీఎ్‌ఫకు బంగారు బిస్కెట్లను తీసుకుని వెళుతున్నారు. మార్గమధ్యలో వి.కోట మండలం నాయకనేరి ఘాట్‌ వద్ద దుండగులు కారును అడ్డగించి, బంగారు బిస్కెట్లను దోచుకెళ్లారు. దీపక్‌ కుమార్‌ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించి.. కర్ణాటక, తమిళనాడుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వి.కోట మండలం రాఘవపల్లె సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట వి.కోట-పలమనేరు హైవేపై శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు.


కేజీఎఫ్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ జయపాల్‌(67), ముక్రమ్‌(42), కేఆర్‌బాబు(61), షణ్ముగం(59) కారులో బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. జయపాల్‌ను విచారించగా, నగల వ్యాపారి దీపక్‌కుమార్‌కు చెందిన బంగారం బిస్కెట్లను తామే దోచుకున్నట్లు అంగీకరించాడు. దీపక్‌కుమార్‌ డ్రైవర్‌ ముక్రమ్‌ ఈ సమాచారాన్ని ఇచ్చినట్లు జయపాల్‌ చెప్పాడు. తమిళనాడుకు చెందిన మరో 12 మందితో కలిసి దోపిడీకి పాల్పడినట్లు తెలిపాడు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 07 , 2025 | 05:28 AM