YS Sharmila: దేశానికి కాంగ్రెస్ ఎంతో అవసరం
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:53 AM
దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అగ్రనేతలతో భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అహ్మదాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీకి తెలిసిందల్లా విభజించి పాలించడమే. మతం పేరుతో మంట పెట్టి చలి కాచుకోవడం ఆపార్టీకి అలవాటు. ఎన్నికల సంఘంతో సహా వ్యవస్థలన్నింటినీ సొంత అవసరాలకు వాడుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన కాంగ్రె్‌సతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెలా భారీ కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని షర్మిల తెలిపారు.