Cockfights : కత్తి కడతారా బాబూ!
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:19 AM
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
కత్తులు దూసిన కోళ్లు... పందెం రాయుళ్ల హుషారుతో పల్లెలు చిందులేశాయి! గోదావరి జిల్లాల నుంచి కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వెలిసిన బరులు కోళ్ల యుద్ధానికి వేదికలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన పండుగలో తొలిరోజు భోగినాడే సుమారు రూ.300 కోట్ల మేరకు కరెన్సీ కట్టలు పందేలొడ్డాయి. గుండాట, లోనబయట, పేకాటలతో ‘భోగి’ సాగిపోయింది!!
ABN Desk : ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు నిరాశకు గురయ్యారు. అలాగే కోళ్లకు కత్తులు కట్టేవారు కూడా దొరకకపోవడంతో మరిన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ స్థాయిలో ఎప్పుడూ బరులు లేకపోవడంతో కత్తులు కట్టే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Updated Date - Jan 14 , 2025 | 04:19 AM