Pawan Kalyan: గర్జించిన పవన్.. ఇది కదా అసలైన పవర్..
ABN, Publish Date - Mar 14 , 2025 | 09:04 PM
జనసేన జయకేతనం సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగన్ సర్కార్ చేసిన అరాచకాలను, అన్యాయాలను ప్రస్తావించారు. అంతేకాదు.. తాను ఎదుర్కొన్న సమస్యలను సైతం పవన్ చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాన్ ఇంకా ఏం మాట్లాడారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

పిఠాపురం, మార్చి 14: పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ గర్జించారు. నిర్భంధాలను చిత్తు చేసి.. అధికార పీఠం ఎక్కిన తీరును ప్రస్తావించారు. అన్యాయాన్ని, అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు. పవన్ తన ప్రసంగం ప్రారంభిస్తూ.. ఎంతో స్ఫూర్తిదాయకమైన పాటను ప్రస్తావించారు. అచ్చమిల్లై.. అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడారు. భయం లేదు.. భయం లేదు.. అంటూ తన ధైర్యానికి కారణాన్ని పేర్కొన్నారు జనసేనాని.
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇదే..
ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు.. గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే.. అన్నీ ఒక్కడినే ఐ.. 2014 లో జనసేన పార్టీ స్థాపించాను. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాను. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు జరిచారు, తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. ప్రజలను హింసించారు. ఇదేమి న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు. వారి పార్టీ సీనియర్ నాయకులను రోడ్డు మీద రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడిపై చేయని కుట్ర లేదు, తిట్టని తిట్టు లేదు, వేయని నిందలు లేవు. ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం.
తెలంగాణపై కీలక వ్యాఖ్యలు..
తెలంగాణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మ స్థలం తెలంగాణ అయ్యింది.. కర్మ స్థలం ఆంధప్రదేశ్ అయ్యింది. కృష్ణమాచార్య మాటలు.. మాకే కాదు.. మన ప్రజలకు ఊతమిచ్చాయి. నా గుండె లోత్తుల్లో నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. మూగబోయిన కోటి మంది తమ్ముళ్ల గళాన్ని వినిపించిన నా తెలంగాణా కోటి రతనాల వీణ. అలాంటి కోటి ధివిటీల కాంతి జ్యోతి తెలంగాణా. ఆనాడు కరెంటు షాక్ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాకు చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి ఆశీస్సులు.. నన్ను ప్రేమించే ప్రజల దీవెన నాకు ఊపిరి ఇచ్చింది. అలాంటి తెలంగాణ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బండెనక గట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ కాళ్లకు గజ్జె కట్టి.. చేతికి కర్ర పెట్టి.. ఆటని, పాటని ఆయుధంగా మలిచిన వాడు.. యువతలో స్పూర్తిని నింపినవాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే.. మన దగ్గర లేని నా గద్దరన్న. మా ఆడపడుచులు, వీర మహిళల స్పూర్తి, పోరాటాన్ని నేను మరువను. మీరంతా రాణి రుద్రమలు.. జనసేన వీరమహిళలు.. అందరి క్షేమం కాంక్షించే సూర్య కిరణాల లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీమ్‌లు.. మా జనసేన వీర మహిళలు అంటూ తన ప్రసంగంలో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు పవన్ కల్యాణ్.
భారత్ మాతాకీ జై..
తన ప్రసంగం సందర్భంగా పవన్ కల్యాన్ భారత్ మాతాకీ జై అని నినదించారు. నేడు హెూలీ పండుగ.. మైత్రిని పంచే పండుగ. చెడు పోయింది.. మంచి వచ్చింది అని ఉత్సవం చేసే పండుగ. మన జయకేతనం ఎగుర వేసిన రోజు.. హెూలీ రావడం యాధృచ్చికం కాదు.. భగవంతుని నిర్ణయం. తమిళనాడు షణ్ముఖ్ యాత్రకు వెళితే.. నాపై ఎంతో ప్రేమ చూపించారు. తమిళనాడు ప్రజలందరికీ మనస్పూర్తిగా నా నమస్కారాలు. మహారాష్ట్ర వెళితే.. సినిమా పరంగా కాకుండా రాజకీయ పరంగా కూడా నాపై అబిమానం చూపారు. ఎన్డీయే కూటమి కోసం అక్కడ ప్రచారం చేయగా.. 95శాతం విజయం సాధించాం. కర్నాటకలో కూడా నా మీద ప్రేమ చూపించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. బహుభాషా ప్రావీణ్యం ఎంతో మంచిది అన్న పవన్.. భారత్ మాతాకీ జై అని నినదించారు.
రాజకీయాలకు వస్తానని ఆనాడే చెప్పా..
2009 లో ప్రజారాజ్యంతో నా రాజకీయం ప్రారంభమైంది. కానీ 2003 లో నా తండ్రికి చెప్పా.. నేను రాజకీయాల్లోకి వస్తా అని. నేను సమాజం మీద బాధ్యతతో ఆలోచించా. సినిమాల పరంగా ఎదగాలని అనుకోలేదు. నా ఖుషీ సినిమా చూసి.. గద్దర్ మా అన్నయ్యల ద్వారా నన్ను కలిశారు. ఏ మేరా జహా అనే పాటలో నా సీన్స్ చూసి.. నన్ను గద్దర్ అభినందించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. 2006 లో ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి రాజకీయాల్లోకి వస్తారా అని నన్ను అడిగారు. నాకు అప్పుడు రాజకీయాలపై అవగాహన లేదని, మెచ్యూరిటీ వచ్చాక వచ్చి కలుస్తా అని చెప్పాను. ఆ వ్యక్తిని ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఆయనే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు. నన్ను సినిమాల్లో చూసి ఓజీ అంటున్నారు. నేను సమాజం కోసం ఆలోచన చేసే ఇటువంటి వారిని చూస్తాను. అణగారిన వర్గాల కోసం పని చేసే వ్యక్తి మన ప్రొఫెసర్ గారు. నా గుండెల నుంచి ప్రొఫెసర్ గారికి ప్రేమను మాత్రం ఇవ్వగలను.. అంటూ సన్మానించిన పవన్ కళ్యాణ్.
అభిమానులకు హితవు..
పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా.. కొందరు అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాన్ వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ సభలో సినిమా గురించి మాట్లాడం సరికాదని హితవు చెప్పారు. ఇక్కడ జనసైనికులు ప్రాణలు తెగించి పోరాటం చేసినవాళ్లు. 450 మంది పైగా జనసైనికులు సిద్దాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం.. మనం సినిమాలు ఇక్కడ మాట్లాడవద్దు. ఇక్కడ నా పేరు అంటున్నారంటే.. నా మాట వినడం లేదని అర్థం. 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే.. ఈ 11 యేళ్లల్లో నేను పడ్డ కష్టాలు, బాధలు ఏమిటో కొంతైనా మీతో పంచుకుంటాను. మీ అందరినీ గుండెల్లో పెట్టుకున్నాను.. మీరే నా కుటుంబం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 09:43 PM