Raghu Rama Raju Torture Case: రఘురామ కేసులో నేడు పోలీసుల ముందుకు ప్రభావతి
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:00 AM
రఘురామరాజు కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. శరీర上的 గాయాల నివేదికల తారుమారు కేసులో ఆమెపై ప్రధాన అభియోగం ఉంది

రెండ్రోజులు ప్రశ్నించనున్న ప్రకాశం ఎస్పీ
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీ చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితురాలి (ఏ-5)గా ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ డాక్టర్ ప్రభావతి ఎట్టకేలకు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. సోమ, మంగళవారాల్లో ఒంగోలులో ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆమెను ప్రశ్నించనున్నారు. ప్రభావతి విచారణకు హాజరు కావలసిందేనని.. సహకరిస్తామని చెబితేనే ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించామని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రఘురామరాజు శరీరంపై గాయాలకు సంబంధించి జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికలను తారుమారు చేశారన్నది ఆమెపై ప్రధాన అభియోగం.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్