2024-25 ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని ఆదాయం రూ.142.89 కోట్లు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:07 AM
అన్నవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల ద్వారా రూ.142,89,13,196 ఆదాయం సమకూరగా వివిధ పద్దుల కింద రూ.147,53,85,371 వ్యయం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదాయ మార్గాల్లో వ్రతం

వ్యయం 147.53 కోట్లు
రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు.. కానరాని మిగులు
అన్నవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల ద్వారా రూ.142,89,13,196 ఆదాయం సమకూరగా వివిధ పద్దుల కింద రూ.147,53,85,371 వ్యయం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదాయ మార్గాల్లో వ్రతం టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.38.39 కోట్లు, ప్రసాదాల విక్రయాల నుంచి రూ.33.06 కోట్లు, భక్తుల హుండీల్లో సమర్పించిన కానుకల నుంచి రు.18.79 కోట్లు, వివిధ షాపుల లైసెన్స్ అద్దెల నుంచి రూ.15.76 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.5.49 కోట్ల ఆదాయం లభించింది. వివిధ పద్దుల ద్వారా వ్యయాన్ని పరిశీలిస్తే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం భక్తుల సౌకర్యాలకు రూ.12.74 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టడంతో సుమారు రూ.5 కోట్ల వ్యత్యాసం కనిపించిందన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలకు రూ.23.35 కోట్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.13.79 కోట్లు, కా ంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు రూ. 8.10 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, వ్రత పురోహితులు ఇతరులకు రెమ్యునరేషన్ రూపంలో రూ.15.97 కోట్లు, ఎస్‌పిఎఫ్ భద్రతా సిబ్బందికి, సెక్యూరిటీ గార్డుల జీతాలకు రూ.4.35 కోట్లు, ప్రసాదం తయారీకి ముడిసరుకు కొనుగోలుకు రూ.23.17 కోట్లు వ్యయం చేశారు. రూ.12.74 కోట్లు వివిధ నిర్మాణాలు చేపట్టినందుకు చెల్లింపులు చేశారు. విద్యుత్, వాటర్‌వర్క్స్ సంబంధించి రూ.4.53 కోట్లు వ్యయం చేశారు.