Share News

Konaseema: వారిని గెలిపించడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు..

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:33 PM

కోమసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Konaseema: వారిని గెలిపించడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు..
Minister kinjarapu Atchannaidu

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌కు ఘన విజయం అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్నెన్నాయుడు కోరారు. ప్రతి ఒక్క కూటమి కార్యకర్త, నేత వారి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోమసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


గెలిపించండి..

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. "ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాజశేఖర్ గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. పట్టభద్రుల వద్దకు వెళ్లి అభ్యర్థిని గెలిపించేలా ప్రచారం చేయాలి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి అవగాహన కల్పించాలి. కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన ముందున్న ప్రథమ లక్ష్యం. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తాం. రాజోలులో ఇంటింటికీ మంచినీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. వ్యవసాయానికి పెద్దపీట వేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం.


చంద్రబాబు అంటే అది..

కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసి భారీగా నిధులు మంజూరు చేస్తే వైసీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటు. వారి హయాంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమైనా నిధిలు వచ్చాయా?. జగన్ తీరుకు పెట్టుబడులు రాకపోవటం వల్ల ఏపీ అభివృద్ధి ఐదేళ్లపాటు కుంటుపడింది. వైసీపీ పాలనలో పరిశ్రమలు రాష్ట్రం విడిచి పారిపోయాయి. జగన్ హయాంలో ఐదేళ్లపాటు జరగని అభివృద్ధిని కేవలం ఏడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసి చూపింది. ఏపీ అభివృద్ధి పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న అంకితభావం వల్లే అది సాధ్యమైంది. జగన్ పాలనలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.1,300 కోట్లు వెచ్చించి రోడ్లన్నీ అద్దంలా మార్చామని" చెప్పారు.


ఎన్నికలు ఎప్పుడంటే..

కాగా, ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 10వ తేదీ వరకూ వాటిని స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 13న వాటి ఉప సంహరణకు తుది గడువని ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం

Updated Date - Feb 05 , 2025 | 03:33 PM