Share News

పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులయ్యారు

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:32 AM

కోరుకొండ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలోని రైస్‌ మిల్లు వద్ద శనివారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాపవరం గణపతి రైస్‌మిల్లులో శనివారం ఉదయం ధాన్యం లోడు చేసే కన్వర్ట్‌ బెల్ట్‌ను ట్రాలీపై తీసుకెళ్తుండగా సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్‌ వైర్లకు ట్రాలీ చివరి భాగం తగిలి షాక్‌కు గురయ్యారు.

పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులయ్యారు
మృతిచెందిన శ్రీరామ్‌, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురి మృతి

మరో ముగ్గురికి గాయాలు

కాపవరం రైస్‌ మిల్లు వద్ద ప్రమాదం

కోరుకొండ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలోని రైస్‌ మిల్లు వద్ద శనివారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాపవరం గణపతి రైస్‌మిల్లులో శనివారం ఉదయం ధాన్యం లోడు చేసే కన్వర్ట్‌ బెల్ట్‌ను ట్రాలీపై తీసుకెళ్తుండగా సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్‌ వైర్లకు ట్రాలీ చివరి భాగం తగిలి షాక్‌కు గురయ్యారు. ఆకుల శ్రీరామ్‌(30), జాజుల వెంకటేశ్వరరావు(55), బలసాల అన్నవరం సత్యనారాయణ(45) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామ ంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్ట కూటి కోసం వెళ్లిన తమ వారు విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాద విష యం తెలియడంతో రాజానగరం ఎమ్మెల్యే బ త్తుల బలరామకృష్ణ, రాజమండ్రి నార్త్‌జోన్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు వంతున ప్రభు త్వం నుంచి సహాయం అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే మిల్లు యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని పెద్దల సమక్షంలో నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా కాపవరం విద్యుత్‌ ప్రమాదంపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యకిషోర్‌ పేర్కొనారు.. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో షాక్‌కు గురై స్వల్పంగా గాయపడిన శ్రీరంగం నాగు, ఆకుల ఏసురాజు, కోరుకొండ రాజులు క్షేమంగానే ఉన్నారు.

రెక్కాడితే కానీడొక్కాడని కుటుంబాలు..

విద్యుత్‌ ప్రమాదంలో మరణించిన ఆకుల శ్రీరామ్‌, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ కుటుంబాలు రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ రైతు కూలీలు. ప్రతిరోజు రైస్‌ మిల్లుకు వెళ్లి లారీ లోంచి ధాన్యం బస్తాలు దింపి మిల్లుకు వేయడం, మిల్లులో తయారైన బియ్యం లారీలో లోడ్‌ చేయడం చేస్తుంటారు. అలా కూలి డబ్బులతోనే వారి జీవనం గడుస్తుంది. శ్రీరామ్‌ కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. పిల్లలు చిన్న వారు కావడం, కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోవడంతో దిక్కులేని వారయ్యారు. వెంకటేశ్వరరావుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. వెంకటేశ్వరరావు మిల్లులో పనిచేసే డబ్బులతోనే కుటుంబ పోషణ జరిగేది. అన్నవరం సత్యనారాయణకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముగ్గురు మరణించ డంతో నిరుపేద కుటుంబాలు రోడ్డున ప డ్డాయి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సర్పంచ్‌ జాజుల రాము, ఎంపీటీసీ కాలచర్లనాగు, వైస్‌ ఎంపీపీ బొరుసు బద్రి మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Updated Date - Apr 13 , 2025 | 12:32 AM