పేదలకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:46 AM
పేదలకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.

మలికిపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): పేదలకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.34లక్షల చెక్కులను 59మందికి అందజేశారు. పది నెలల కాలంలో 206మందికి రూ.2కోట్లు సీఎం సహాయనిధి నుంచి సహాయం అందించామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో అవకాశం లేని పేదలందరికీ సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందిస్తున్నామన్నారు. కూటమి నాయకులు ముప్పర్తి నాని, చాగంటి స్వామి, గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ ఎంవీ సత్యవాణి, పినివెట్టి బుజ్జి, అడబాల యుగంధర్, మల్లెపూడి సత్తిబాబు, సూరిశెట్టి శ్రీనివాస్, జక్కంపూడి శ్రీదేవి, చెల్లుబోయిన హెలీన, లలితాశివజ్యోతి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
‘