Share News

పీహెచ్‌సీలను తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:31 AM

ద్రాక్షారామ పీహెచ్‌ిసీని మంగళవారం జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. లేబరేటరీలో జరుగుతున్న పరీక్షల వివరాలు తెలుసుకున్నారు.

పీహెచ్‌సీలను తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి

ద్రాక్షారామ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామ పీహెచ్‌ిసీని మంగళవారం జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. లేబరేటరీలో జరుగుతున్న పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులు వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ ప్రశాంతి, సబ్‌ యూనిట్‌ అధికారి సత్యనారాయణ, సీహెచ్‌వో యు.వీరవేణి, ఎంపీహెచ్‌ఎస్‌ ఎన్‌.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కపిలేశ్వరపురం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంగర పీహెచ్‌సీని మంగళవారం ఇన్‌చార్జ్‌ జిల్లా మలేరియా అధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లేబొరేటరీ ని సందర్శించి వాటి రికార్డులు, రిపోర్ట్‌లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ రత్నకుమారి, సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, హెచ్‌ఈ రామారావు, ల్యాబ్‌ టెక్నిషీయన్‌ ఆలీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:31 AM