Share News

మామిడి నేలబడి.

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:37 AM

చూడగానే నోరూరించే మామిడి పండ్లు ఈ సీజన్‌లో కొనడం కష్టంగానే కనిపిస్తోంది.. అకాల వర్షాలు, వడగండ్లు... ఈదురుగాలులుతో కొన్నిరోజులుగా ఉమ్మడి జిల్లాలో మామిడికి తీవ్రంగా నష్టం వాటిల్లింది..

మామిడి నేలబడి.

రారాజు మామిడికి గడ్డురోజు

ఉమ్మడి తూ.గో.జిల్లాలో అకాల వర్షాలతో తీవ్ర నష్టం

తీవ్ర ఈదురుగాలులతో భారీగా రాలిపోయిన మామిడికాయలు

ఈదురుగాలులకు 16 వేల ఎకరాల్లో నష్టం.. రైతులు లబోదిబో

ఉమ్మడి జిల్లాలో 38,500 ఎకరాల్లో మామిడితోటలు.. ఒక్క కాకినాడ జిల్లాలోనే 18,400 ఎకరాల్లో సాగు

ఉమ్మడి జిల్లా నుంచి ఏటా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల కాయల దిగుబడి

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

చూడగానే నోరూరించే మామిడి పండ్లు ఈ సీజన్‌లో కొనడం కష్టంగానే కనిపిస్తోంది.. అకాల వర్షాలు, వడగండ్లు... ఈదురుగాలులుతో కొన్నిరోజులుగా ఉమ్మడి జిల్లాలో మామిడికి తీవ్రంగా నష్టం వాటిల్లింది.. ఎక్కడికక్కడ చెట్ల నుంచి కాయలు భారీగా నేలరాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.. మరో రెండు వారాల్లో కాయలు పక్వానికి వచ్చే దశలో ఉండగా, అకాల వర్షాలు విరుచుకుపడడడంతో కాయలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయిన పరిస్థితితో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా ఉండ డంతో మంచి లాభాలు వస్తాయని రైతులు అంచనా వేసుకున్నారు. అటు వ్యాపారులు సైతం లక్షల్లో అడ్వాన్సులు ఇవ్వడంతో రైతులు పెట్టుబడి భారీగా పెట్టారు. తీరా అకాలవర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో 19 వేల ఎకరాల్లో తోటల్లో నేలరా లిన కాయలకు ఇప్పుడు ధరలు కూడా రాకపో వడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నా రు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో 38,500 ఎక రాల్లో మామిడి తోటలు సాగవుతుండగా, ఒక్క కాకినాడ జిల్లాలోనే 18,400 ఎకరాల్లో ఉన్నాయి. ఏటా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల కాయల దిగుబడి జరుగుతుండగా, ఈ దఫా సగానికి పైగా దిగుబడి పడిపోయే ప్రమాదం ఉంది.

మామిడీలా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల లోనే పలుసార్లు అనేక మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కురిశాయి. దీంతో చెట్లకు ఉన్న యాభై శాతానికిపైగా కాయలు రాలిపోయాయి. కాస్తోకూస్తో మిగిలిన కాయల నాణ్యత సైతం దెబ్బతినడంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పక్వానికి ముందే రాలిపోయిన మామిడి మార్కెట్లకు వచ్చినా కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించ డం లేదు. అటు తాండ్ర తయారీదారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మామిడి పూత నూరుశాతం వచ్చింది. కాయలు సైతం 70శాతానికిపైగా నిలబడ్డాయి. ఫలితంగా భారీగా మార్కెట్‌ ఉంటుందని రైతులు భావించారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపా రులు వచ్చి కాయలు చూసి లక్షల్లో రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. దీంతో లాభాలొస్తా యన్న అంచనాలతో రైతులు సైతం పెట్టుబడులు భారీగా పెట్టారు. ప్రధా నంగా ఈసారి బంగినపల్లి టన్ను రూ.60 వేలు, కొత్తపల్లి కొబ్బరి టన్ను రూ.90 వేలు, పండూరు మామిడి టన్ను రూ.65 వేల వర కు ధర వెళ్తుందని రైతులు భా వించారు. వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 38,500 ఎకరాల్లో మామిడి తోటలు సాగవు తున్నాయి. ఇందులో అత్యధికంగా కాకినాడ జిల్లాలోనే 18,400 ఎకరాల్లో సాగవుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మామిడి దిగు బడి అవుతుంది. ఇందులో 600 టన్నుల వరకు ఒక్క దక్షిణ కొరియాకే ఎగుమతి అవుతాయి. ఇందులో ఎక్కువగా కాకినాడ జిల్లా నుంచి అధి క ఎగుమతులు జరుగుతాయి. అత్యధిక సాగు కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం, గొల్ల ప్రోలు, తుని, తొండంగి, కోటనందూరు, శంఖ వరం, రౌతులపూడి, జగ్గంపేట, గండేపల్లి మం డలాల్లో తోటలున్నాయి. అటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, మండపేట, ఆలమూరు తదితర ప్రాంతాల్లో వివిధ రకాల మామిడి తోటలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, రాజమహేంద్ర వరం రూరల్‌, సీతానగరం తదితర మండలా ల్లో రైతులు వందల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అయితే తాజాగా కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో 16 వేల ఎకరాల్లో తోటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా. అయితే మరో రెండు వారాల్లో చెట్ల నుంచి కాయలు దించడానికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అకాల వర్షాలతో రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ప్రధానంగా ఈవారంలో మూడుసార్లు కురిసిన భారీ వర్షా లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఆది వారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు, వడ గండ్ల వానతో నష్టం మరింత పెరిగింది. పది రోజుల వ్యవధిలో కాయలు కోసి మార్కెట్‌కు పంపడం తరువాయి అనే దశలో వీచిన పెనుగాలుల ప్రభావంతో మామిడితోటల్లో కాయల న్నీ నేలరాలిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో ఎక్కడ మామిడి తోటలు చూసినా రాలిపోయిన మామిడికాయలు గుట్టలు, గుట్టలుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌ చివరి వారం నుంచి మార్కెట్‌కు నాణ్యత కలి గిన మామిడి రాక ప్రారంభమవుతుంది. అంత కంటే ముందుగానే మామిడి వచ్చినా వాటి నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ ఏడాది మామిడి మార్కెట్‌ ఆశాజనకంగా ఉం డడం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఆర్డర్లు ఉన్న నేపథ్యంలో తమ పంట పండుతుందని రైతు లు ఆశించారు. అయితే ఈదురుగాలులకు ఎక్క డిక్కడ మామిడికాయలు రాలిపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మామిడితోటల్లో రాలిన మామిడిని ఏరి గుట్టలుగా పోయడంలో రైతులు నిమగ్నమయ్యారు. రాలిన మా మిడికి ఏరివేత కూలి వస్తే అదే చాలని చెబుతున్నారు. మరోవైపు చెట్లకు మిగిలి ఉన్న మామిడి నాణ్యత సైతం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

కాయరాలితే నష్టం చెల్లింపు నిల్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మామిడి, జీడిమామిడి వంటి పండ్లకు సంబంధించి ఈదురుగాలుల వల్ల కాయలు రాలిపోతాయి. చెట్ల కొమ్మలు విరిగిపోతుం టాయి. కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఏకంగా చెట్లు నేల కూలి తేనే పరిహారం ఇస్తారు. ఎన్నికాయలు రాలిపోయినా, చెట్లు కొమ్మలు విరిగిపోయినా పరిహారం రాదు. నిజానికి లక్షల్లో కౌలు చెల్లించి మామిడి తోటలు రైతులు తీసుకుంటారు. కాయలు రాలిపోతే మొత్తం నష్టపోతారు.

Updated Date - Apr 15 , 2025 | 01:37 AM