Nimmal Ramanaidu: జగన్ హయాంలోనే ఎక్కువ నష్టం.. నిమ్మల ఫైర్
ABN , Publish Date - Feb 05 , 2025 | 03:43 PM
Nimmala Ramanaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు.

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 5: జిల్లాలోని కొవ్వూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కంటే 2019 తరవాత జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganamohan Reddy) పరిపాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని తెలిపారు. 2014 నుండి 19 సంవత్సరం తెచ్చిన కంపెనీలను జగన్ తరిమేశారని విమర్శించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ అందిస్తోందన్నారు.
జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బూత్ కన్వీనర్లు కేటాయించిన పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిపించాలని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి ఏం చేశాడంటే..
మరోవైపు ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానాన్ని గెలిపించే బాధ్యతను గోదావరి జిల్లాల నేతలకు, శ్రేణులకు అప్పగించింది. కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్‌ను గెలిపించేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించి కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కూటమి నేతలు, కార్యకర్తలకు చెబుతున్నారు. కూటమి నేతలు, కేడర్ ఐక్యంగా అభ్యర్థిని గెలిపించే పనిలో నిమగ్నమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 3 లక్షలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. కాగా.. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఈనెల 8, 9 తేదీలు సెలవు రోజులు. ఆ రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఆపై 13న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27 ఉదయం పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఎమ్మె ల్సీ ఎన్నికలకు 440 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3,15,261 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..
Breaking News: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం శుభవార్త..
Read Latest AP News and Telugu News