జనసేనదే..నిడదవోలు పీఠం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:24 AM
ఒక్క కౌన్సిలరూ లేరు..అయినా ప్రస్తుత నిడద వోలు పీఠం జనసేనదే.. వ్యూహ ప్రతి వ్యూహా లతో నిడదవోలు మునిసిపాలిటీపై జనసేన పట్టు సాధించింది..

మంత్రి దుర్గేష్ ఓటుతో కలిసి 15కు చేరిన కూటమి బలం
నిడదవోలు మునిసిపాలిటీలో జనసేన పాగా
నిడదవోలు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : ఒక్క కౌన్సిలరూ లేరు..అయినా ప్రస్తుత నిడద వోలు పీఠం జనసేనదే.. వ్యూహ ప్రతి వ్యూహా లతో నిడదవోలు మునిసిపాలిటీపై జనసేన పట్టు సాధించింది.. మంత్రి దుర్గేష్ నియోజక వర్గంలో వైసీపీ జెండా పీకేసి జనసేన జెండా ఎగురవేసింది. నిడదవోలు మునిసిపాలిటీలో మొత్తం 28 మంది సభ్యులు ఉండగా కూట మి తరపున టీడీపీకి ఉన్నది ఒక్క కౌన్సిలర్ మాత్రమే. మిగిలిన 27 మంది వైసీపీ కౌన్సి లర్లే. దీంతో తొలుత పీఠం వైసీపీదే. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన నుంచి కందుల దుర్గేష్ ఎన్నికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అనంతరం రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోయాయి. వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా జనసేన బాట పట్టారు. మంత్రి దుర్గేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి సైతం అవకాశం లేకుం డాపోయింది. ఈ మేరకు కలెక్టర్ ప్రకటన విడుదల చేయడంతో నిడ దవోలు మునిసిపా లిటీ జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మునిసిపాలిటీలోని 28 వార్డులకు మార్చి 15వ తేదీ 2021లో ఎన్నికలు జరగ్గా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక్క వార్డులో మాత్రమే టీడీపీ విజయం సాధిం చింది. దీంతో నిడదవోలు మునిసిపల్ కౌన్సిల్ వైసీపీ వశమైంది.అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు చైర్మన్ పదవీ కాలాన్ని భూపతి ఆదినారాయణకు రెండున్నరేళ్లు.. కామిశెట్టి వెం కట సత్యనారాయణకు రెండేళ్లు.. మిగిలిన కా లం పువ్వల రతీదేవి పదవి చేపట్టేలా ఒప్పం దం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీని వాస్ నాయుడు ఓటమి పాలై కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రాజకీయ పరిణామాలు మారి పోయాయి. చైర్మన్ కుర్చీ వివాదం ముదిరి పాకాన పడింది. ఇదిలా ఉండగా మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకు న్నారు. ఇంకా 19 మంది సభ్యుల బలం వైసీ పీకి ఉంది.ఈ ఏడాది మార్చి 18వ తేదీ నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కావడంతో వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ పీఠంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వా లంటూ కలెక్టర్ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితలకు వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామంతో ఒక్కొక్కరుగా మరో నలుగురు కౌన్సిలర్లు జనసేనకు జైకొట్టారు. దీంతో పూర్తిగా జనసేన మెజార్టీ 13కు చేరు కుంది. వీరికి తోడు మరొక టీడీపీ కౌన్సిలర్ ఉండడంతో 14 కాగా మంత్రి దుర్గేష్‌కు కౌన్సి ల్‌లో ఓటు ఉండడంతో జనసేన బలం 15కు చేరుకుంది. చైర్మన్ పీఠంపై అవిశ్వాస తీర్మా నం ప్రవేశ పెట్టాలంటే 15 మంది సభ్యుల బలం ఉండాలి. ప్రస్తుతం వైసీపీ బలం 14కి పడిపోయింది.దీంతో అవిశ్వాసానికి అవకాశం లేకుండాపోయింది. మెజార్టీ కౌన్సిలర్లు లేకపో వడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదంటూ శుక్రవారం కలెక్టర్ ప్రకటన విడు దల కావడంతో నిడదవోలు మునిసిపాలిటీ జనసేన కైవసం చేసుకుందని జనసేన పార్టీ వర్గాలు ప్రకటించాయి. నిడదవోలు మునిసి పాలిటీలో పరిణామాలపై ఏప్రిల్ 5వ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనమే నిజ మైంది. ఇదిలా ఉండగా నిడదవోలులో శనివా రం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన వర్గాలు నిడదవోలు మునిసిపల్ కౌన్సి ల్‌ను జనసేన కైవసం చేసుకుందనే విష యాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు సిద్ధ మవుతున్నట్టు సమాచారం.
కొప్పవరం సర్పంచ్ బులిమోహనరెడ్డి రాజీనామా
అనపర్తి : అనపర్తి మండలం కొప్పవరం గ్రామ సర్పంచ్ కర్రి బులిమోహనరెడ్డి(వైసీపీ) శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం తన రాజీనామా లేఖను ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డికి తన రాజీనామా లేఖను అందజేశారు. తన వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేసినట్టు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.