Share News

ఓఎన్జీసీ వైఖరిపై మోకాళ్లపై అర్ధనగ్న నిరసన

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:16 AM

నలభై ఏళ్లుగా ఓడలరేవు గ్రామాభివృద్ధి పట్ల ఓఎన్జీసీ అధికారులు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గ్రామస్తులు మోకాళ్లపై నిలుచుకుని అర్థనగ్న ప్రదర్శన చేశారు.

ఓఎన్జీసీ వైఖరిపై మోకాళ్లపై అర్ధనగ్న నిరసన

అల్లవరం ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నలభై ఏళ్లుగా ఓడలరేవు గ్రామాభివృద్ధి పట్ల ఓఎన్జీసీ అధికారులు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గ్రామస్తులు మోకాళ్లపై నిలుచుకుని అర్థనగ్న ప్రదర్శన చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఓడలరేవు గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కడలి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు కొల్లు విష్ణుమూర్తి, పచ్చిమాల ఏడుకొండలు, నాతి లెనిన్‌బాబు, పినపోతు ప్రకాష్‌, గుబ్బల నాగేశ్వరరావు, నాగాబత్తుల గోపి, గ్రామస్తులు, మహిళలు నిరసనలో పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:16 AM