కొంతమూరులో నెమళ్లు
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:08 AM
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13(ఆంధ్ర జ్యోతి): జనావాసాల్లో రెండు నెమళ్లు సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని కొంత మూరు శేషాద్రి హిల్స్ ప్రాంతంలో ఆది వారం ఒక నెమలిని కుక్కలు తరు ముండగా స్థానికులు కాపాడి రాజమండ్రి ఫారెస్ట్ రేంజర్ దావీద్‌రాజుకు అప్పగిం

కుక్కల బారి నుంచి కాపాడిన స్థానికులు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13(ఆంధ్ర జ్యోతి): జనావాసాల్లో రెండు నెమళ్లు సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని కొంత మూరు శేషాద్రి హిల్స్ ప్రాంతంలో ఆది వారం ఒక నెమలిని కుక్కలు తరు ముండగా స్థానికులు కాపాడి రాజమండ్రి ఫారెస్ట్ రేంజర్ దావీద్‌రాజుకు అప్పగిం చారు. తర్వాత మరో నెమలిని స్థానికులు తీసుకొచ్చి అప్పగించారు. ఇవి రెండూ ఆడ నెమళ్లు. వివరాలిలా ఉన్నాయి. కొంతమూరు శేషాద్రి హిల్స్ సమీపంలో ఆదివారం ఉదయం ఒక నెమలిని కుక్కలు తరుమున్నాయని చెప్పి, ఇక్కడి నివాసి అయిన కేవీ మాధవరావు, కుటుంబ సభ్యు లు అనంతలక్ష్మి, సాత్విక్ దత్తు దానిని స్థానికుల సహాయంతో కాపాడి రేంజ్ ఆఫీసర్‌కు ఇచ్చారు. కొందరు స్థానికులు మరో నెమలిని తెచ్చి ఇచ్చారు. దానికి కాలి కి వేళ్లు వంకరగా ఉన్నాయి. పుట్టుకతోనే అలా ఉన్నట్టు అధికారులు చెబుతు న్నా రు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరైనా తీసుకొచ్చారా? ఈ ప్రాంతంలోనే ఉంటు న్నాయా? అనే కోణం నుంచి ఆరా తీస్తు న్నట్టు దావీద్‌రాజ్ తెలిపారు. వీటికి ఏవిధ మైన గాయాలు కాలేదని, సోమవారం వె ౖద్యుడితో పరీక్షలు చేయించి ఉన్నతాధికారు ల సలహాతో ఫారెస్ట్‌లో వదిలేయడం లేదా, జూపార్కుకు ఇవ్వడం విషయంలో నిర్ణ యం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం క్షేమ ంగా అటవీ అధికారుల పర్యవేక్షణలో ఉ న్నాయి. వీటి వయస్సు మూడేళ్ల నుంచి 4 ఏళ్లలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.