Share News

ఆటవిడుపుగా క్రీడా పోటీలు అభినందనీయం

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:57 AM

విధి నిర్వహణలో ఆటవిడుపుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఆటవిడుపుగా క్రీడా పోటీలు అభినందనీయం

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఆటవిడుపుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిత్యం ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొనే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు జిల్లాస్థాయిలో డ్రీమ్‌ 2కే -25 క్రీడా పోటీలు నిర్వహించారు. మహిళా, పురుష విభాగాల్లో క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, చెస్‌, క్యారమ్స్‌ వంటి పోటీలను నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవ సభ నడిపూడి డాక్టర్‌ బాబూజగ్జీవన్‌రామ్‌ కమ్యూనిటీ హాలులో మంగళవారం జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. తొలుత కలెక్టరేట్‌లో క్రీడా విజేతలకు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ షీల్డులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందడంతోపాటు క్రీడా ప్రతిభను చాటాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ఆయన సూచించారు. బహుమతి ప్రదానోత్సవ సభలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు శ్రమించిన పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అన్యం రాంబాబును పలువురు అభినందించారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను సహాయ ఇంజనీర్లుగా పదోన్నతి పొందడానికి డిప్లమో ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తరపున కృషిచేస్తానని రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రాంబాబు అన్నారు. పీఆర్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పీఎస్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల స్పోర్ట్స్‌ మీట్‌ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి క్రీడాపోటీలను నిర్వహించిన, ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరు అభినందనీయులన్నారు. ఈ పోటీల్లో క్రికెట్‌ విన్నర్స్‌గా నిలిచిన కొత్తపేట జట్టును కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్ర మంలో ఆర్‌అండ్‌బీ కార్యనిర్వాహక ఇంజనీర్‌ బి.రాము, సీపీవో పి.వెంకటేశ్వర్లు, గృహనిర్మా ణ సంస్థ ఈఈ ఎంవీ నరసింహారావు, డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఎంవీవీ కిశోర్‌, వివిధ శాఖల ఇంజనీర్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు జిల్లా కోఆర్డినేటర్‌ కాలే సురేష్‌, జి.గౌతమ్‌రాజు, కె.ధర్మాజీ తెలిపారు.

Updated Date - Apr 09 , 2025 | 01:58 AM