Share News

నిందితులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:07 AM

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు పాస్టర్లు అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రవీణ్‌ పగడాల మృతికి సంతాపంగా ఆదివారం కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌, క్రైస్తవ సంఘాల నాయకులు, ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.

నిందితులపై చర్యలు తీసుకోవాలి
కడియంలో భారీగా శాంతి ర్యాలీ

  • పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సంతాపం

  • కడియంలో భారీగా శాంతి ర్యాలీ

  • ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు వినతి

కడియం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు పాస్టర్లు అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రవీణ్‌ పగడాల మృతికి సంతాపంగా ఆదివారం కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌, క్రైస్తవ సంఘాల నాయకులు, ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. వీరికి ముస్లిం నాయకులు, వివిధ సంఘాల నాయకులు సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి వారి హక్కులకు, మందిరాలకు, ఆస్తులకు, ప్రబోధకులకు రక్షణ కల్పించాలన్నారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేగురుపాడు సర్పంచ్‌ యాదల స్టాలిన్‌, జిల్లాపెలోషిప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.కరుణాకర్‌, రూరల్‌ రీజనల్‌ చైర్మన్‌ డి.పరంజ్యోతి, ఏఐసీసీ రీజనల్‌ చైర్మన్‌ కె.జయశీల్‌, ఏఐసీసీ మండల ప్రెసిడెంట్‌ సాలోమన్‌, కడియం ప్రెసిడెంట్‌ మోడీ, పాస్టర్ల పెలోషిప్‌ సంఘ నాయకులు జీవరత్నం, పి.శామ్యూల్‌రాజు, సీహెచ్‌ రత్నదీప్‌, రత్నరాజు, కె.ఎలీషా, బిషప్‌, రెయిన్‌హార్డ్‌, కె.మోహన్‌, కె.పౌలు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 01:07 AM