AP News: ఎన్నికలకు కౌన్సిలర్లను రాకుండా నిర్బంధిస్తున్న వైఎస్సార్‌సీపీ
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:53 AM
కాకినాడ జిల్లా, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి మంగళవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.

కాకినాడ జిల్లా: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election ) మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం ఉదయం 11గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు (YSRCP Councilors ) సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు (Detained). దీంతో కోరం లేక అధికారులు ఎన్నికను రద్దు చేశారు. తిరిగి మంగళవారం ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP)కి చెందిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీ (TDP)లో చేరడంతో మిగిలిన వారిని చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు.
ఈ వార్త కూడా చదవండి..
నన్ను అరెస్టు చేయండి.. మంచు మనోజ్
మంగళవారం సయితం కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో కోరం లేక అధికారులు ఎన్నికను రద్దు చేశారు. వాస్తవానికి తుని మున్సిపాల్టీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకుగాను వైఎస్సార్‌సీపీ బలం 27గా ఉంది. వీరిలో పది మంది ఇటీవల టీడీపీలో చేరిపోయారు. దీంతో మిగిలిన తమ పార్టీ కౌన్సిలర్లు కూడా చేజారిపోతారనే భయంతో, సోమవారం మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్దకు వారందరినీ తరలించి నిర్బంధించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ నివాసంలో బంధించిన కౌన్సిలర్లను బయటకు తీసుకురావాలని టీడీపీ నేతలు చైర్మన్ నివాసానికి కొద్దిదూరంలో ఆందోళనకు దిగారు. అయితే ఉదయం నుంచీ అక్కడే మాకం వేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరులు కవ్వింపు చర్యలకు దిగారు. ఇరువర్గాల తోపులాట జరిగింది. రాజా సైతం టీడీపీ నేతలపైకి దురుసుగా దూసుకువచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు నాలుగోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. కాగా, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కౌన్సిలర్లు ఓటు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, టీడీపీ నేత పోలిశెట్టి రామలింగేశ్వరరావుపై దాడి చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News