రెపరెపలాడిన యూటీఎఫ్ జెండా
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:27 AM
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ ధ్వంసమైందని ధ్వజ మెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ వాటిని కాపాడు కోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్ 17వ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకు

కాకినాడలో ఘనంగా ప్రారంభమైన
యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు
తొలిరోజు20వేల మంది
ఉపాధ్యాయులు హాజరు
వైసీపీ హయాంలో పాఠశాలలు నాశనం
ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు
ప్రాణాలైన అర్పిస్తాం : సభలో వక్తలు
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ ధ్వంసమైందని ధ్వజ మెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ వాటిని కాపాడు కోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్ 17వ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఎన్ని ఉద్యమాలైనా చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం 117 జీవో ద్వారా పాఠశాల విద్యకు ఉరిశిక్ష విధించిందన్నారు. 3,4,5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లలో కలిపి విద్యా వ్యవ స్థను నాశనం చేసిందని విమర్శించారు. వైసీపీ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యారంగం సర్వ నాశనమైందని, సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. నేటి పాలకుల ఉదాసీన వైఖరి వల్ల రాజ్యాంగ లక్షణాలు మరుగునపడ్డాయని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత యూటీఎఫ్ ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ విద్యారంగ విద్య నానాటికీ కుంటుపడుతుందన్నారు. ఇప్పటికే దేశంలో సగంవరకు విద్యారంగం ప్రైవేటీ కరణ జరిగిందని దీని వల్ల పేద విద్యా ర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 75ఏళ్ల రిపబ్లిక్ డే ఉత్స వాలు జరుపుకుంటున్న మనం ప్రభుత్వ రంగంలో ఉన్న బడులను సంరక్షించు కోవాలన్నారు. దేశంలో వెయ్యి విశ్వ విద్యాలయాలు ఉంటే దానిలో సగం వరకు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయన్నారు. 1984లో జాతీయస్థాయిలో ప్రవేశపెట్టిన విద్యాపాలసీ వల్లే విద్యలో ప్రైవేటీకరణకు బీజం పడిందని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రైవేటీ కరణను ప్రోత్సహించాయని ఆయన పేర్కొన్నారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి
ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారని, రాష్ట్రంలో ప్రభుత్వ రంగ పాఠ శాలలను పరిరక్షించుకోవాలన్నారు. గత ప్రభుత్వం తీరుతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఉభయ గోదావరిజిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ యూటీఎఫ్ ఏర్పాటై యాభైఏళ్లు పూర్తి కావడంతో సర్ణోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్క రించిందన్నారు. జాతీయ విద్యా విధానం 2020ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఇది విద్యారంగంలో మతతత్వాన్ని పెంచేదిగా ఉందన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. గత ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ట్యాబ్‌లు, బైజూస్ వంటి విద్యావిధానాలు ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దీంతో రాష్ట్రంలో లక్షన్నరమంది విద్యా ర్థులు విద్యకు దూరమయ్యారన్నారు. విద్యావ్యవస్థను నాశ నం చేసే అన్ని నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. సుమారు రూ.31వేలకోట్ల బకాయిలు ఉపా ధ్యాయులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ యాభైఏళ్ల ఉద్యమాలతో ప్రభుత్వ బడులను కాపాడుకుందన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధా నాల వల్ల విద్యావ్యవస్థ కోలుకోని దెబ్బతగిలిందన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి విద్యారంగాన్ని కాపాడుకున్నామ న్నారు. తొలుత జాతీయ జెండాను, తర్వాత యూటీఎఫ్ జెండాను, ఎస్టీఎఫ్‌ఐ జెండాలను సీనియర్ నాయకులు కె.సత్తిరాజు, బీవీ రాఘవులు, జి.చిట్టిబాబులు ఆవిష్క రించారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాసిన నాలుగు పుస్త కాలను సభలో ఆవిష్కరించారు. యూటీఎఫ్ అమరజీవుల స్థూపాన్ని అఖిలభారత ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి ఆవిష్కరించారు. తదనంతరం 16 మహా సభల జాతాల జెండాలను ఆవిష్కరించారు.
కిక్కిరిసిన పీఆర్ ప్రాంగణం
ఈ మహాసభలకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి యూటీఎఫ్ ఉపాధ్యాయులు 20వేల మంది హాజరయ్యారు. దీంతో పీఆర్ కళాశాల ప్రాంగణం కిక్కిరిసింది. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి, కాకినాడ ఆర్జేడీ నాగమణి, మాజీ అధ్యక్షుడు జోజయ్య, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నగేష్, చక్రవర్తి, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కుసుమకుమారి, కుమార్‌రాజా, హనుమంతురావు, నాగమ ల్లేశ్వరరావు, అ న్నారాం, మనోహర్, జ్యోతి బసుచఅరుణకుమారి ఉన్నారు.
అప్పుడు రజతోత్సవాలు.. ఇప్పుడు స్వర్ణోత్సవ సంబరాలు
యూటీఎఫ్ 25ఏళ్ల రజతోత్సవాలు, 50 ఏళ్ల స్వర్ణోత్సవ మహాసభలకు కాకినాడలోని పీఆర్ కళాశాల వేదికగా నిలిచింది. 25ఏళ్ల క్రితం ఇదే పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యూటీఎఫ్ రజతోత్సవాల సభలు ఘనంగా జరిగాయి. మళ్లీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణత్సవాలు సభలు ఇక్కడే జరగడం విశేషం.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రౌతులపూడి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునులు వివిధ గీతాలకు నృత్యాలు చేశారు.
పసందైన వంటకాలతో విందు
యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలకు రెండు రాష్ట్రాల నుంచి 20వేల మంది ఉపాధ్యాయులు విచ్చేయగా అందరికీ నోరూరించి పసందైన వంటకాలతో విందు అందించారు. ఎమ్మెల్సీలు గోపిమూర్తి, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు భోజనాలు వడ్డించారు.