Share News

జేఎన్టీయూకేలో ముగిసిన టెక్‌ ఫెస్ట్‌

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:05 AM

జేఎన్టీయూకే, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూలో 2రోజులు జరిగిన జాతీయ స్థాయి సింపోజియం టెక్‌ ఫెస్ట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు ము ఖ్య అతిథిగా హాజరైన ఉప కులపతి సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ విద్యార్థులు తయారుచేసిన

జేఎన్టీయూకేలో ముగిసిన టెక్‌ ఫెస్ట్‌
విద్యార్థినులు ఏర్పాటు చేసిన చేసిన ఎలక్ర్టికల్‌ వాహనాన్ని పరిశీలిస్తున్న వీసీ ప్రసాద్‌

జేఎన్టీయూకే, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూలో 2రోజులు జరిగిన జాతీయ స్థాయి సింపోజియం టెక్‌ ఫెస్ట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు ము ఖ్య అతిథిగా హాజరైన ఉప కులపతి సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్ట్‌లు, పేపర్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, టెక్నికల్‌ క్విజ్‌, డ్రోన్‌ ప్రజంటేషన్‌, స్పాట్‌ ఈవెంట్స్‌ను సందర్శించి అభినందించారు. అనంతరం యూసీఈకే ప్రిన్సిపాల్‌ కార్యాలయ సెమినార్‌ హాల్లో రోబోటిక్‌ అప్లికేషన్ల కోసం కస్టమ్‌ ఎంబెడెడ్‌ బోర్డును అభివృద్ధి చేయడం అంశంపై నిర్వహించిన శిక్షణను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు, ప్రతిభాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, హెచ్‌వోడీలు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌, వర్శిటీ, అనుబంధ కళాశాలల విద్యార్థులున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:05 AM